కుమారుడికి డాక్టర్ల పేరు పెట్టి రుణం తీర్చుకున్న బ్రిటన్ ప్రధాని...

బోరిస్ జాన్సన్ (Image : boris johnson / Instagram)

కోవిడ్-19 కు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లతోపాటు తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని తమ బిడ్డకు నామకరణం చేసినట్టు పేర్కొన్నారు.

  • Share this:
    కరోనా నుంచి బయటపడి పునర్జన్మ ఎత్తిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ మధ్యే జన్మించిన తన కుమారుడికి తనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ల పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని భార్య సీమండ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కోవిడ్-19 కు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లతోపాటు తమ పూర్వీకులు పేర్లు కలిసి వచ్చేలా విల్‌ఫ్రెడ్ లౌరీ నికోలస్ జాన్సన్ అని తమ బిడ్డకు నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా సోకి చావు అంచుల దాకా వెళ్లి బతికి బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇటీవలే ఆయన భార్య క్యారీ సీమండ్స్ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తనను మృత్యు ఒడిలోంచి కాపాడిన వైద్యుల రుణాన్ని తన బిడ్డకు వారి పేరు పెట్టడం ద్వారా తీర్చుకున్నారు బోరిస్ జాన్సన్. బోరిస్ తన తాత పేరు విల్‌ఫ్రెడ్, అలాగే ట్రీట్మెంట్ అందించిన వైద్యులు నిక్ ప్రైస్, నిక్ హర్ట్ ఇలా నలుగురి పేర్లు కలిసొచ్చేలా కుమారుడికి పెట్టినట్టు వివరించారు.
    Published by:Krishna Adithya
    First published: