BOOSTER DOSE IN INDIA DOUBTS ABOUT THIRD DOSE KNOW LATEST GOVERNMENT GUIDELINES EVK
Booster Dose in India: బూస్టర్ డోస్‌పై సందేహాలా.. ప్రభుత్వం తాజా గైడ్‌లైన్స్ ఇవే!
రెండు డోసులు పొందిన ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు, జనవరి 10 నుండి మరొక డోస్ కోవిడ్ వ్యాక్సిన్ అందించబడుతుంది.
Booster Dose in India | ప్రధాని మోదీ.. వాజ్‌పేయి జయంతి సందర్భంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు ఇవ్వడంతోపాటు ఫ్రంట్‌లైన్ కార్మికులకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు బూస్టర్ డోస్ (మూడో డోస్) ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ బూస్టర్ డోస్ జనవరి 10 , 2021 నుంచి అందిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ బూస్టర్ డోస్ అందించేందుకు కసరత్తు ప్రారంభించింది.
ప్రధాని మోదీ (Pm Modi) వాజ్‌పేయి జయంతి సందర్భంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు ఇవ్వడంతోపాటు ఫ్రంట్‌లైన్ కార్మికులకు, 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు బూస్టర్ డోస్ (మూడో డోస్) ఇస్తున్నట్టు ప్రకటించారు. ఈ బూస్టర్ డోస్ జనవరి 10 , 2021 నుంచి అందిస్తున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ బూస్టర్ డోస్ అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. కరోనా వ్యాక్సిన్ (Corona Vaccine) దేశంలో ఇవ్వడం ప్రారంభించాక ముందుగా కోవిడ్ పోరులో ప్రధానంగా ఉన్న ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇచ్చారు. అనంతరం 45 ఏళ్లు పైబడిన వారికి ఇచ్చారు. ప్రస్తుతం ఒమిక్రాన్ (Omicron) వ్యాప్తి నేపథ్యంలో మూడో డోస్ ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ ప్రకటించింది. ఇందుకు సంబంధించిన తాజా గైడ్‌లైన్స్‌ను కూడా వెల్లడించింది.
ప్రస్తుతం ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే ప్రస్తుతం టీకా అందిస్తారు. ఎందుకంటే 18 ఏళ్లపైబడిన వారికి టీకాలు ఇవ్వడం ప్రారంభించి నాలుగు నెలుల మాత్రమే అవుతుంది. ఒకసారి వ్యాక్సిన్ తీసుకొంటే శరీరంపై ఆరునెలలపైన ఉంటుంది. ఈ నేపథ్యంలో వయోజనలకు బూస్టర్ డోస్ (Booster Dose) ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తుంది.
బూస్టర్ డోస్ ఎవరికి ఎప్పుడు ఇస్తారు..
ఈ సంవత్సరం 10 ఏప్రిల్ 2021 నాటికి రెండవ డోస్ తీసుకొన్న 60 ఏళ్ల పైబడిన వారు, ఫ్రంట్‌లైన్ కార్మికులు మాత్రమే మూడవ డోస్‌కు అర్హులు. అంటే రెండు డోస్‌లు తీసుకొని 9 నెలల నుంచి 12 నెలల పూర్తయిన వారికి మాత్రమే మూడో డోస్ ఇస్తారు.
బూస్టర్ డోస్ వారిని ఎలా గుర్తిస్తారు..
ప్రస్తుతం ప్రభుత్వం వద్ద టీకా తీసుకొన్న వారి సమచారం అంతా కోవిన్ పోర్టల్‌లో ఉంది. ఈ క్రమంలో రెండు డోస్‌లు పూర్తయి.. తొమ్మిది నుంచి 12 నెలలు గడిన వారిని సిస్టమ్ ఆటోమెటిక్‌గా గుర్తిస్తుంది. వారికి మాత్రమే మూడో డోస్ తీసుకోవడానికి రిజిస్టర్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఈ నిబంధనల వృద్ధులతోపాటు ఫ్రంట్‌లైన్ కార్మికులకు కూడా వర్తిస్తుంది.
ధ్రువపత్రాలు అవసరమా..
మూడో డోస్ తీసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న వ్యాధులన్నింటికి సంబంధించని ధ్రువపత్రాలను సమర్పించాలి. అది కూడా రిజిస్టర్ డాక్టర్ చేత ధ్రువీకరించుకోవాలి.
ధ్రువపత్రాలు సమర్పించాల్సిన వ్యాధుల వివరాలు..
- మధుమేహం, మూత్రపిండ వ్యాధి లేదా డయాలసిస్
- కార్డియోవాస్కులర్ వ్యాధి
- స్టెమ్ సెల్ మార్పిడి
- క్యాన్సర్
- సిర్రోసిస్
- సికిల్ సెల్ వ్యాధి
- స్టెరాయిడ్స్ దీర్ఘకాలం ఉపయోగించడం
- రోగనిరోధక మందులు
- కండరాల బలహీనత
శ్వాసకోశ వ్యవస్థపై యాసిడ్ దాడి
- అధిక మద్దతు అవసరాలతో నిలిపివేయబడింది
- చెవిటి-అంధత్వం వంటి బహుళ వైకల్యాలు
- తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో రెండేళ్లుగా ఆసుపత్రిలో ఉండాలి
కోవిడ్ షీల్డ్.. కోవాక్జిన్ ఏదీ ఇస్తారు..?
ప్రస్తుతం ప్రభుత్వం దీనికి సంబంధించి సమాచారం ఇవ్వలేదు. మీరు రెండు డోస్‌ల కోవాక్సిన్ (CoVaxin)ను స్వీకరించినట్లయితే, మీకు కోవిషీల్డ్ (covishield) యొక్క మూడవ డోస్ ఇవ్వబడుతుంది. అయితే అటువంటి పరిస్థితిలో తక్కువ కోవాక్సిన్ లభ్యత అతిపెద్ద సమస్య కావచ్చు. కాబట్టి వ్యాక్సిన్ మిక్స్ ఫార్ములా అవలంభిస్తారా లేక వేరే విధానం తీసుకొస్తారా అని ఇంకా ప్రభుత్వం వెల్లడించల లేదు. త్వరలో ఈ విషయం వెల్లడించే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.