Home /News /coronavirus-latest-news /

BOOSTER DOSE DISTRIBUTION TO THOSE OVER 30 IN PAKISTAN AS CORONA CASES INCREASE SNR

Pakistan: థర్డ్‌వేవ్ థ్రెట్..థర్టీ ఇయర్స్ దాటితే బూస్టర్‌ డోస్ మస్ట్

photo credit:youtube

photo credit:youtube

Pakistan: కరోనా థర్డ్‌వేవ్ ముప్పు తప్పదని పాకిస్తాన్‌ భావిస్తోంది. అందుకే అక్కడ 30సంవత్సరాలు దాటిన వాళ్లకు బూస్టర్ డోస్ అందిస్తోంది. కేవలం ఒక్కరోజులో 708 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఈ నిర్ణయం తీసుకుంది పాక్‌ ప్రభుత్వం. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసులు పెరగడంతో బూస్టర్ డోస్ తీసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ఇంకా చదవండి ...
ప్రపంచం అంతా మళ్లీ కరోనా (Corona)నీడలోకి వెళ్లిపోతోంది. ఓవైపు ఒమిక్రాన్‌ (Omicran)వ్యాప్తితో వణికిపోతున్న ప్రపంచ జనాభాకు. కోవిడ్ థర్డ్‌వేవ్ (Third wave)దడ పుట్టిస్తోంది. రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులకు పాకిస్తాన్‌(Pakistan) కూడా భయపడిపోతోంది. అందుకే ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ముందుగానే మేల్కొంది. మిగిలిన దేశాలతో సంబంధం లేకుండా దేశ తమ పౌరులకు బూస్టర్ డోస్‌(Booster dose) పంపిణి చేస్తోంది. నష్టనివారణపై దృష్టి పెట్టిన పాకిస్తాన్ (Pakistan)ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ పంపిణి విషయంలో వయోపరిమితి నిబంధనల్ని కూడా పక్కన పెట్టేసింది. ఇరుగు, పొరుగు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విస్తృతంగా పెరుగుతున్న నేపధ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగానే పాకిస్తాన్ తమ దేశ ప్రజలకు బూస్టర్‌ డోస్ పంపిణి చేయడం ప్రారంభించింది. పాకిస్తాన్‌లో 30ఏళ్ల వయసు పైబడిన(Age 30 above)వాళ్లందరికి బూస్టర్ డోస్ అందించే కార్యక్రమాన్ని చేపడుతోంది. కరోనా ఫస్ట్, సెకండ్‌ వేవ్‌లోని పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొనే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లుగా అక్కడి ప్రభుత్వ అధికారులు వెల్లడించారు.

30ఏళ్లు దాటితో మూడేది పడాల్సిందే..
పాకిస్తాన్‌ ప్రభుత్వం బూస్టర్‌ డోస్ అందిస్తున్నట్లు ప్రకటించడంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో యువకుల నుంచి మధ్య వయస్సు కలిగిన వ్యక్తులు, వృద్ధులు సైతం బూస్టర్ డోస్ తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ముందుగానే బూస్టర్ డోస్ వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేషన్‌లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యాక్సిన్ క్యాంప్‌లకు వెళ్లి మరీ స్వచ్చందంగా టీకాలు తీసుకుంటున్నారు.

థర్డ్‌వేవ్‌ దృష్ట్య పాక్‌ ప్రభుత్వం అలర్ట్ ..
పాకిస్తాన్‌లో ఒక్కరోజులో 708కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గడిచిన రెండు నెలల్లో నమోదైన కేసులతో పోలిస్తే ఇదే అత్యధికం కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్‌19 కేసులతో పాటు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల సంఖ్య అత్యధికంగా కరాచీలో పెరగడంతో జనవరి 3వ తేది నుంచి బూస్టర్‌ డోస్ అందజేస్తోంది. ప్రస్తుతానికి 70మిలియన్‌ జనాభా కలిగిన పాకిస్తాన్‌లో రెండు వ్యాక్సిన్ డోసులు తీసుకున్న వారి సంఖ్య 32శాతంగా ఉన్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

భారత్‌లో బూస్టర్‌ డోస్‌ ఎప్పుడేస్తారు..?
భారత్‌లో మాత్రం బూస్టర్‌ డోస్‌ని 60ఏళ్లు దాటిన వారికే ఇవ్వాలని కేంద్రం మొదటగా భావించింది. రెండు డోస్‌లు తీసుకొని 60 ఏళ్లు పైబ‌డిన వారు, ఫ్రంట్‌లైన్ కార్మికులు మాత్ర‌మే మూడవ డోస్‌కు అర్హులు. అంటే రెండు డోస్‌లు తీసుకొని 9 నెల‌ల నుంచి 12 నెల‌ల పూర్త‌యిన వారికి మాత్ర‌మే మూడో డోస్ ఇస్తారు.ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం వ‌ద్ద టీకా తీసుకొన్న వారి స‌మ‌చారం అంతా కోవిన్ పోర్ట‌ల్‌లో ఉంది. ఈ క్ర‌మంలో రెండు డోస్‌లు పూర్త‌ై.. తొమ్మిది నుంచి 12 నెల‌లు గ‌డిన వారిని సిస్ట‌మ్ ఆటోమెటిక్‌గా గుర్తిస్తుంది. వారికి మాత్ర‌మే మూడో డోస్ తీసుకోవ‌డానికి రిజిస్ట‌ర్ ఆప్ష‌న్ ఓపెన్ అవుతుంది. ఈ నిబంధ‌న‌ల వృద్ధుల‌తోపాటు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌ కూడా వ‌ర్తిస్తుంది.
Published by:Siva Nanduri
First published:

Tags: Coroana cases, Pakistan, Vaccination

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు