Home /News /coronavirus-latest-news /

BOLLYWOOD CELEBRITIES NANA PATEKAR PRIYANKA ROHIT SHETTY MANY OTHER DONATE PM RELIEF FUND FOR FIGHT AGAINST CORONA TA

కరోనాపై పోరులో తమ వంతు సాయం అందిస్తున్న బాలీవుడ్ తారలు..

కరోనా బాధితులకు విరాళాలుప్రకటించిన బాలీవుడ్ తారలు (Twitter/Photo)

కరోనా బాధితులకు విరాళాలుప్రకటించిన బాలీవుడ్ తారలు (Twitter/Photo)

Pm Relief Fund | ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా పలువురు సినీ నటులు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.

ఇంకా చదవండి ...
  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ వైరస్ నివారణ కోసం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజుల పాటు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కరోనాపై పోరాటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు తమవంతు సాయం చేయడంలో నిమగ్నమయ్యాయి. వీరికి సినీ నటులు కూడా అండగా నిలుస్తున్నారు.ఇప్పటికే చాలా మంది తెలుగు సినిమా నటులు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అటు తమిళ సినీ నటులు తమ సినీ కార్మికులను ఆదుకోవడం కోసం తమ వంతు సాయం చేస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ నటులు ఒక్కొక్కరుగా తమ వంతు విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇక బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్.. సినిమా వాళ్లలో ఎవరికి అందనంత ఎక్కువగా రూ.25 కోట్ల విరాళం ప్రకటించి సంచలనం సృష్టించారు. తనను ఈ స్థాయిలో నిలబెట్టిన ప్రజల కోసం ఎంత ఇచ్చిన తక్కువే అంటూ తన వినమ్రతను వ్యక్తం చేసాడు. ఆయన బాటలోనే పలువురు బాలీవుడ్ తారలు ఒక్కొక్కరుగా ముందుకు వచ్చిన తమ వంతు సాయం చేస్తున్నారు.

  Bollywood Hero Akshay Kumar Donates Rs.1 Crore to Odisha Chief Minister Relief Fund for phani cyclone victims,akshay kumar,akshay kumar donates rs 1 crore for phani cyclone victims,akshay kumar twitter,akshay kumar instagram,akshay kumar interview with pm narendra modi,akshay kumar phani cyclone,akshay kumar filmy updates,akshay kumar donates rs 1 crore to odisha cm,cyclone fani,cyclone,cyclone fani news,cyclone fani live,cyclone fani odia,cyclone fani update,cyclone fani latest news,akshay kumar,fani cyclone,modi akshay kumar,akshay kumar citizenship,akshay kumar narendra modi,pm modi akshay kumar,fani cyclone map,pm modi and akshay kumar,narendra modi akshay kumar interview,fani cyclone status,fani yclone,akshay kumar pm narendra modi interview,jabardasth comedy show,ఫొని తుపాను,ఫొణి తుఫాను,ఫణి తుపాను,ఫొని తుపాను బాధితులకు అక్షయ్ కుమార్ రూ కోటి విరాళం,ఒడిషా తుపాను బాధితులకు కోటి విరాళం ప్రకటించిన అక్షయ్ కుమార్,అక్షయ్ కుమార్ ట్విట్టర్,అక్షయ్ కుమార్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటర్వ్యూ,అక్షయ్ కుమార్ నరేంద్ర మోదీ,అక్షయ్ కుమార్ ఉదారత,
  ప్రధాని మోదీతో బాలీవుడ్ అక్షయ్


  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.. హిందీ చలన చిత్ర పరిశ్రమ ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు తన వంతుగా 25వేల మంది సినీ కార్మికులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. మరోవైపు గాన కోకిల లతా మంగేష్కర్ తన వంతుగా రూ.25 లక్షల విరాళాన్ని మహారాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. మరోవైపు సీనీయర్ బాలీవుడ్ నటుడు నానా పాటేకర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. అంతేకాదు పీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో రూ.50 లక్షల అందజేయనున్నారు. మొత్తంగా రూ. కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సవ్యసాచి ముఖర్జీ రూ. కోటి విరాళాన్ని ప్రకటించారు. అటు హీరోయిన్స్ ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, ఆలియా భట్, సారా అలీ ఖాన్ పీఎం రిలీఫ్ ఫండ్‌కు తమ వంతు సాయం ప్రకటించారు. ఎవరు ఎంత అనేది ప్రకటించలేదు. మొత్తంగా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ఒక్కొక్కరు తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akshay Kumar, Bollywood, Coronavirus, Covid-19, Katrina Kaif, Nana Patekar, PM Narendra Modi, Priyanka Chopra, Varun Dhawan, Vicky Kaushal

  తదుపరి వార్తలు