Home /News /coronavirus-latest-news /

BOLLYWOOD ACTOR AKSHAY KUMAR DONATES 1 CRORE TO GAUTAM GAMBHIR FOUNDATION TO HELP COVID19 VICTIMS SK

Oxygen Crisis: ఆక్సిజన్ కోసం.. గౌతమ్ గౌంభీర్‌కు రూ.కోటి విరాళం ఇచ్చిన అక్షయ్

గౌతమ్ గంభీర్, అక్షయ్ కుమార్

గౌతమ్ గంభీర్, అక్షయ్ కుమార్

ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో కోవిడ్ బాధితులకు గంభీర్ తనవంతు సాయం చేస్తున్నారు. పూసా రోడ్, జాగృతి ఎన్‌క్లేవ్‌లో ఉన్న తన కార్యాలయాల నుంచి అవసరమైన వారికి ఆక్సీజన్ సిలిండర్లు, ఫాబి ఫ్లూ మందులు సరఫరా చేస్తున్నారు.

    ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత నెలకొంది. అన్ని ఆస్పత్రులు ఆక్సిజన్ లేక ఇబ్బందులు పడుతున్నాయి. ప్రాణ వాయువు సకాలంలో అందక చాలా మంది రోగులు మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ దాతలు ముందుకొస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్‌లోనూ తోచినంత సాయం చేస్తున్నారు. బాలీవుడ్ అక్షయ్ కుమార్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ఫౌండేషన్‌‌కు రూ. కోటి విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు గౌతం గంభీర్. ప్రస్తుతం ఆయన తన ఫౌండేషన్ ద్వారా కోవిడ్ బాధితులకు అవసరమైన మందులు, ఆక్సిజన్, ఆహారం అందించేందుకు తన వంతు సాయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే గంభీర్ ఫౌండేషన్‌కు అక్షయ్ కుమార్ విరాళమిచ్చారు.


    కోటి రూపాయల విరాళం ఇచ్చినందుకు అక్షయ్ కుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు గంభీర్. ఇది నిజంగా కష్ట కాలమని.. ఇలాంటి సమయంలో సాయం చేసే అవాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. ఈ కోవిడ్ సంక్షోభం నుంచి త్వరలోనే బయటపడతామని ఆయన ఆకాంక్షించారు. కాగా, కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో పీఎం కేర్స్‌కు అక్షయ్ కుమార్ భారీగా విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ఏకంగా రూ.25 కోట్లు విరాళం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

    ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో కోవిడ్ బాధితులకు గంభీర్ తనవంతు సాయం చేస్తున్నారు. పూసా రోడ్, జాగృతి ఎన్‌క్లేవ్‌లో ఉన్న తన కార్యాలయాల నుంచి అవసరమైన వారికి ఆక్సీజన్ సిలిండర్లు, ఫాబి ఫ్లూ మందులు సరఫరా చేస్తున్నారు. డాక్టర్ ప్రిస్కిప్షన్‌తో పాటు ఆధార్ కార్డుతో సమర్పించి వీటిని తీసుకోవచ్చని తెలిపారు.

    ఢిల్లీలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం 24,103 మందికి కరోనా నిర్ధారణ అయింది. 22,695 మంది కోలుకోగా.. మరో 357 మంది మరణించారు. ఢిల్లీలో ఇప్పటి వరకు 10 లక్షల 4వేల 782 కేసులు నమోదయ్యాయి. వీరిలో 8 లక్షల 97వేల 804 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి ఇప్పటి వరకు 13,898 మంది మరణించారు. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో 93,080 యాక్టివ్ కేసులున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Akshay Kumar, Bollywood, Coronavirus, Delhi, Gautam Gambhir, Sports

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు