BODY OF DROWNED UKRAINIAN MAN TESTS COVID POSITIVE 28 TIMES OVER 6 WEEKS PVN
Covid Positive : చచ్చినా వదలని కరోనా..6 వారాల్లో 28 సార్లు పాజిటివ్
ప్రతీకాత్మక చిత్రం
28 Times Covid Positive : 41 రోజుల్లో 28సార్లు టెస్ట్ చేయగా.. ప్రతిసారీ కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఉక్రెయిన్ దేశానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఇటలీ వెళ్లాడు. అక్కడ తన స్నేహితుడితో కలిసి బీచ్ కు వెళ్లాడు. ఆ సమయంలో వాతావరణం ఏమాత్రం బాగాలేకపోయినా
Body of drowned Ukrainian man : మృతదేహాల్లో కోవిడ్ వైరస్ ఎంతసేపు సజీవంగా ఉంటుంది,మృతదేహాల నుంచి కరోనా ఇతరులకు వ్యాపిస్తుందా అనే ప్రశ్నలు మహమ్మారి విజృంభణ మొదలైనప్పటి నుంచి వైద్య వర్గాల్లో చర్చయనీయాంశంగా ఉన్న విషయం తెలిసిందే. దీనిపై అనేకప రిశోధనలు జరిగాయి. మరెన్నో జరుగుతున్నాయి. మృతదేహాల నుంచి కొవిడ్ వ్యాప్తి చెందినట్లు ఎక్కడా తేలలేదు. మృతదేహాల్లో కరోనా ఎంతకాలం సజీవంగా ఉంటుందన్నదానిపైనా స్పష్టత లేదు. వస్తువులపై కరోనా సజీవంగా ఉండడంపై పరిశోధన చేసినా ఇలాంటి అస్పష్ట ఫలితాలే వచ్చాయి.
అయితే తాజాగా సముద్రంలో మునిగి చనిపోయిన వ్యక్తి మృతదేహానికి కరోనా పరీక్షలు నిర్వహించిన పరిశోధకులు.. ఆశ్చర్యకర విషయాలు వెల్లడించారు. 41 రోజుల్లో 28సార్లు టెస్ట్ చేయగా.. ప్రతిసారీ కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. మృతదేహాల్లో కరోనా వైరస్ ఎంతకాలం సజీవంగా ఉంటుందనే అంశంపై మరింత పరిశోధన జరపాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందని అభిప్రాయపడ్డారు.
ఉక్రెయిన్ దేశానికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి ఇటీవల ఇటలీ వెళ్లాడు. అక్కడ తన స్నేహితుడితో కలిసి బీచ్ కు వెళ్లాడు. ఆ సమయంలో వాతావరణం ఏమాత్రం బాగాలేకపోయినా కూడా సముద్రంలో ఈత కొడుతూ, మునిగిపోయాడు. 16 గంటల తర్వాత అతడి మృతదేహం సముద్రంలోని రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ కు తరలించారు. చనిపోవడానికి ముందు అతడిలో ఎలాంటి కొవిడ్ లక్షణాలు లేవు.
అయితే ఇటలీ ప్రభుత్వ కొవిడ్ నిబంధనల ప్రకారం శవపరీక్షకు ముందు కరోనా పరీక్ష చేశారు. టెస్ట్ లో అతడికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అంత్యక్రియల నిర్వహణకు అనుమతులు రానందున అతడి మృతదేహాన్ని సీల్ చేసి..4 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద హాస్పిటల్ మార్చురీలో భద్రపరచారు. ఆ సమయంలో డి అన్నున్ జియో యూనివర్శిటీ డాక్టర్లు ఆ శవానికి వరుసగా ఆర్టీపీసీఆర్ టెస్టులు చేశారు. 6 వారాల్లో 28సార్లు సాంపిల్స్ తీసి పరీక్షించగా...టెస్ట్ చేసిన ప్రతిసారీ కోవిడ్ పాజిటివ్ గా వచ్చింది. ఆ తర్వాత అంత్యక్రియలు జరపడం వల్ల కరోనా టెస్టు చేయడం కుదరలేదు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.