Black Fungus : ముకోర్మైకోసిస్ - బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి..

Black Fungus : ముకోర్మైకోసిస్ - బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ గురించి ఈ విషయాలు తెలుసుకోండి..

Black Fungus : స్టెరాయిడ్లు కొంతవరకు మేలు చేసినప్పటికీ, అవి అంటువ్యాధులతో పోరాడడంలో వ్యక్తి రోగనిరోధక సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తాయి. అటువంటి సమయంలో వారు ముకోర్మైకోసిస్కు గురవుతారు. ఈ వ్యాధి సైనస్ మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, దీనికి గురైనవారిలో ముఖంలో ఒకవైపు వాపు, తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు లేదా నోటి పైభాగంలో నల్లటి మచ్చలు, ఛాతీలో తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.

 • Share this:
  ఒకవైపు COVID-19 సెకండ్ వేవ్తో ప్రపంచం పోరాడుతుండగా, మరోవైపు ముకోర్మైకోసిస్ అనబడే ఫంగల్ ఇన్ఫెక్షన్ COVID-19 చికిత్స కోసం చేరిన వారిలో కొంతమంది ప్రాణాలను నెమ్మదిగా హరిస్తుంది. ముకోర్మైకోసిస్ను "బ్లాక్ ఫంగస్" అని కూడా పిలుస్తారు, ఇది మన చుట్టుపక్కల వాతావరణంలో ఉండే ముకోర్మైసెట్స్ అనబడే ఒకరకమైన మోల్డ్స్ వలన సంభవిస్తుంది. ఈ రోగకారకాల మాధ్యమాలు అధికంగా ఉన్నప్పటికీ, ఈ వ్యాధి చాలా అరుదుగా ఉంటుంది, డయాబెటిస్ వంటి కొమొర్బిడిటీలను కలిగి ఉండే ఈ వ్యాధి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండేవారిని ప్రభావితం చేస్తుంది.

  COVID-19 అనేది ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, దీనివలన ఊపిరితిత్తులు ఉబ్బడం లేదా వాపుకి గురై ఆక్సిజన్ను ప్రాసెస్ చేయడంలో వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని వలన కలిగే మంట నుండి ఉపశమనం పొందడానికి చాలామంది రోగులకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది. స్టెరాయిడ్లు కొంతవరకు మేలు చేసినప్పటికీ, అవి అంటువ్యాధులతో పోరాడడంలో వ్యక్తి రోగనిరోధక సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తాయి. అటువంటి సమయంలో వారు ముకోర్మైకోసిస్కు గురవుతారు. ఈ వ్యాధి సైనస్ మరియు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది, దీనికి గురైనవారిలో ముఖంలో ఒకవైపు వాపు, తీవ్రమైన తలనొప్పి, ముక్కు దిబ్బడ, ముక్కు లేదా నోటి పైభాగంలో నల్లటి మచ్చలు, ఛాతీలో తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.

  డయాబెటిస్ కారణంగా మూత్రపిండాల సమస్యలు, క్యాన్సర్, స్టెరాయిడ్ల దీర్ఘకాలిక వినియోగం, తెల్ల రక్తకణాలు క్షిణించడం (న్యూట్రోపెనియా) వంటి అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా కలదు. ఒకవేళ ఈ వ్యాధి సోకిన సందర్భంలో యాంటీ ఫంగల్ ఔషధం పాక్షికంగా లేదా మౌఖికంగా ఇవ్వడం జరుగుతుంది, అంతేకాకుండా ఈ వ్యాధి సోకిన కణజాలాన్ని తొలగించడానికి శస్త్రచికిత్సను కూడా సిఫార్సు చేయవచ్చు.

  ముకోర్మైకోసిస్ కేసులు ప్రస్తుతానికి చాలా అరుదుగా ఉన్నప్పటికీ, దీని వ్యాప్తిని నివారించడానికి ప్రతీఒక్కరు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సిఫార్సు చేయడం జరుగుతుంది. అందుకోసం, మీ శ్వాసకోశ వ్యవస్థలో ఫంగల్ బీజకణాలు ప్రవేశించకుండా ఉండేందుకు మాస్క్ ధరించడం ఉత్తమమైన మార్గాలలో ఒకటి. N95 మాస్క్ లేదా డబుల్ మాస్క్ ( లోపల 3 ప్లై మరియు బయట గుడ్డ మాస్క్) సరిపోతుంది. ఇంట్లో మరియు మీ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఫంగస్ పెరుగుదలను తగ్గించవచ్చు. ఇది నీరు నిలిచే ప్రదేశాలలో ఎక్కువగా ఉంటుంది. మట్టికి సంబంధించిన పనులు చేసే సమయంలో చేతికి గ్లౌజులు, మాస్క్లు, షూస్ వంటి రక్షణా పరికరాలను ధరించాలి. పైన వివరించిన వాటిలో ఏదైనా లక్షణాలు ఉన్నవారు దాని వ్యాప్తిని నివారించడానికి పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి.

  భారతదేశంలో COVID-19 నుండి కోలుకున్న వారిలో ముకోర్మైకోసిస్ కేసులు పెరుగుతున్నాయి, అందువలన COVID-19 బారిన పడినవారు లేదా కోలుకున్న ప్రతీఒక్కరు దాని వ్యాప్తిని నివారించడానికి అవసరమైన జాగ్రత్తలను పాటించాలని సూచించారు. ముకోర్మైకోసిస్ సంకేతాలు మరియు లక్షణాలు కనిపించిన వారెవరైనా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించి, తక్షణ చికిత్స తీసుకోవాలి.

  ప్రస్తుతం COVID-19 చికిత్స కోసం ప్రజారోగ్య వ్యవస్థ ఎంతగానో కృషిచేస్తున్న సమయంలో ఈ ముకోర్మైకోసిస్ కొత్తగా సంక్రమించడం అనేది ప్రజారోగ్య వ్యవస్థకు అదనపు భారంగా మారింది. పైగా ఈ ముకోర్మైకోసిస్ చికిత్సకు అవసరమైన మందులు కూడా సమృద్ధిగా అందుబాటులో లేవు, అంతేకాకుండా ఈ వ్యాధి గురించి స్పష్టపమైన అవగాహన కూడా లేదు. అందువలన ఈ ప్రాణాంతక వ్యాధికి చికిత్స అందించడానికి వ్యవస్థ సన్నద్ధమవుతున్నందున, ప్రతీ ఒక్కరు తగిన నివారణా చర్యలను అనుసరిస్తూ వైద్యులకు సహకరించాలి.

  - డాక్టర్ శైలేష్ వాగ్లే, మేనేజర్- కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్, యునైటెడ్ వే ముంబై
  Published by:Sridhar Reddy
  First published: