Black Fungus: బ్లాక్ ఫంగస్ మగాళ్లకే అధికం.. ఆ వ్యాధి ఉన్నవారికి ప్రమాదకరంగా మారుతున్న ఇన్‌ఫెక్షన్

ప్రతీకాత్మక చిత్రం

మ్యూకోర్‌మైకోసిస్.. సైనస్, ముక్కు, కేంద్ర నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులు, జీర్ణశయాంతర ప్రేగు, చర్మం, దవడ ఎముకలు కీళ్లు, గుండె, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది.

  • Share this:
మ్యూకోర్‌ మైకోసిస్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. సింపుల్‌గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే.. ఇదే బ్లాక్ ఫంగస్. గాలిలో ఉండే ఒకరకమైన ఫంగస్ ఈ వ్యాధికి కారణమవుతోంది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత కొంత మంది ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. మరో కొత్త మహమ్మారిగా అభివృద్ధి చెందుతోన్న ఈ వ్యాధి, దేశంలో చాలా మందిని కలవరపెడుతోంది. అయితే ఈ వ్యాధి మదుమేహం ఉన్న పురుషుల్లో అధికంగా వస్తుందని తేల్చారు నలుగురు భారతీయ వైద్యులు. దీని గురించి అందరూ భయపడాల్సిన అవసరం లేదని వారు చెబుతున్నారు. ఈ అధ్యయనం ఫలితాలను ‘మ్యూకోర్‌ మైకోసిస్ ఇన్ కోవిడ్-19’ అనే శీర్షికతో రానున్న పరిశోధన పత్రంలో ప్రచురించనున్నారు.

101 మందిపై అధ్యయనం..
ఈ అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్.. పురుషుల్లో అధికంగా ఉందని అధ్యయనం తేల్చింది. ఈ పరిశోధన కోసం భారత్‌లో మ్యూకోర్‌ మైకోసిస్ బారిన పడిన 101 మంది కోవిడ్ కేసులను బృందం విశ్లేషించింది. ఈ వ్యాధి సోకిన వారిలో 79 మంది పురుషులు ఉన్నారని వారు గుర్తించారు. డయాబెటిస్ ఉన్న వారిలో ఇది ప్రమాదకరంగా మారుతుందని కనుగొన్నారు. 101 మందిలో 80 మందికి మదుమేహం ఉందని పరిశోధకులు తేల్చారు.

ఈ పరిశోధనను ఎల్సేవియర్ జర్నల్‌లో ప్రచురించనున్నారు. కోల్‌కతాలోని జీడీ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ అవదేశ్ సింగ్, డాక్టర్ రీతూ సింగ్, ముంబయి లీలావతి ఆసుపత్రికి చెందిన డాక్టర్ శశాంక్ జోషి, న్యూఢిల్లీలోని నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ కు చెందిన డాక్టర్ అనుపమ్ మిశ్రా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. మొత్తం 101 రోగుల్లో.. భారత్ నుంచి 82 మంది, యూఎస్ నుంచి తొమ్మిది మంది, మరో ముగ్గురు ఇరాన్‌కు చెందిన వారు ఉన్నారు.

కోవిడ్ కు అనుబంధంగా వ్యాపిస్తున్న ఈ వ్యాధితో మహరాష్ట్రలో అత్యధికంగా 90 మంది చనిపోయారు. ఈ అధ్యయనంలో పరీక్షించిన 101 మందిలో 31 మంది ఫంగల్ ఇన్పెక్షన్ కారణంగా మరణించారు. వీరిలో 60 మంది కోవిడ్ ఉంది. 41 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 101 మందిలో మొత్తం 83 మందికి డయాబెటిస్ ఉండగా.. ముగ్గురికు క్యాన్సర్ ఉందని నిర్ధారించారు.

స్టెరాయిడ్స్ వాడకం..
కోవిడ్-19 కోసం మ్యూకోర్‌ మైకోసిస్ రోగులు ఏయే చికిత్సలను తీసుకున్నారో డాక్టర్ శశాంక్ జోషి అధ్యయనం చేశారు. 76 మంది రోగ నిరోధక శక్తి కోసం కార్టికోస్టెరాయిడ్ తీసుకున్నట్లు, 21 మంది రెమ్డెసివిర్, నలుగురు టోసిలిజుమాబ్ తీసుకున్నారని ఆయన స్పష్టం చేశారు. ముంబయికి చెందిన 60 ఏళ్ల డయాబెటిస్ వ్యక్కి రెండింటిని తీసుకున్నట్లు తెలిపారు. ఫలితంగా అతడు ఫంగల్ ఇన్ఫెక్షన్ తో మరణించాడు. ఇదే సమయంలో ముంబయికి చెందిన 38 ఏళ్ల డయాబెటిస్ వ్యక్తి సురక్షితంగా ఉన్నారని, దీని ప్రకారం డయాబెటిస్ రోగుల్లో మరణ తీవ్రత ఎక్కువగా ఉందని అన్నారు.

భారత్ లోనే అధికం..
మ్యూకోర్‌మైకోసిస్.. సైనస్, ముక్కు, కేంద్ర నాడీ వ్యవస్థ, ఊపిరితిత్తులు, జీర్ణశయాంతర ప్రేగు, చర్మం, దవడ ఎముకలు కీళ్లు, గుండె, మూత్రపిండాలను ప్రభావితం చేస్తుంది. ఈ అధ్యయనం ప్రకారం 89 మందికి పైగా ఫంగల్ వృద్ధి ముక్కు, సైనస్ లో ఎక్కువగా ఉందని తేలింది. ఎందుకంటే కోవిడ్-19 శ్వాసకోశ వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి మిలియన్ జనాభాకు 0.005 ఉండగా.. భారత్ లో మాత్రం 1.7 ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. భారత్ లో డయాబెటిక్స్ ఉన్నవారు అధికంగా ఉండటం వల్ల ఈ సంఖ్య 80 రెట్లు ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది.
Published by:Sumanth Kanukula
First published: