black fungus: ఏపీ పైనా ఫంగస్ పంజా.. ఒకేరోజు ముగ్గురు మృతి.. లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తోంది

black fungus: ఏపీ పైనా ఫంగస్ పంజా.. ఒకేరోజు ముగ్గురు మృతి.. లక్షణాలు ఏంటి? ఎందుకు వస్తోంది

ఒకవైపు కరోనా కోరల్లో చిక్కుకుని ఏపీ అల్లాడుతుండగా... మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ ప్రజల్లో వణుకు పుట్టిస్తోంది. బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పదుల నుంచి వందల్లోకి చేరుకుంటున్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు బయటపడుతున్నాయి. అయితే చాలామందికి దీనిపై అవగాహన ఉండడం లేదు. కళ్లు ఎర్రబారడం, దవడలు వాచిపోవడం వంటి లక్షణాలతో అనేక మంది ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే వందల సంఖ్యలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు బయటపడినట్లు అనుమానిస్తున్నారు. నెల్లూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, అనంతపురం ఇలా.. ప్రతి జిల్లాలోనూ బ్లాక్‌ ఫంగస్‌ కలకలం కొనసాగుతోంది.

ఏపీని బ్లాక్ పంగస్ భయపెడుతోంది. ఒక్కరోజే బ్లాక్ ఫంగస్ కారణంగా ముగ్గురు మరణించండం కలకలం రేపుతోంది. అయితే ఆ ఫంగస్ లక్షణాలు ఏంటి? ఎలా గుర్తించాలి అన్నాదానిపై అందరికీ అప్రమత్తత అవసరం.

 • Share this:
  ఓ వైపు కరోనా కాటు.. మరోవైపు బ్లాక్ ఫంగస్ పంజా.. దీంతో దేశం మొత్తం ఆందోళన చెందుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చి తగ్గిపోయిన వారిలో... వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నీరసంగా ఉండటంతో అలాంటి వారిని బ్లాక్ ఫంగస్ టార్గెట్ చేస్తోంది. ఇది పాత ఇన్ఫెక్షనే అయినప్పటికీ.. ఇండియాలో ఇప్పుడు దీని కేసులు ఎక్కువవుతున్నాయి. అంటువ్యాధి కాకపోయినా.. ఇది వచ్చిన వారికి 24 గంటల్లో ట్రీట్‌మెంట్ అందించకపోతే.. ప్రాణాలకే ప్రమాదం. దీంతో అన్ని రాష్ట్రాలూ అప్రమత్తం అవుతున్నాయి. ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ కేసు నమోదైతే.. వెంటనే దానిపై ఫోకస్ పెడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500లపైనే ఈ కేసులు ఉన్నాయి. ఎక్కువగా డయాబెటిస్ ఉన్నవారికీ, కరోనా తగ్గిన వారికీ ఈ సమస్య వస్తోంది.

  తాజాగా ఆంధప్రదేశ్ లోనూ బ్లాక్ ఫంగస్ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. బ్లాక్‌ ఫంగస్‌‌తో శనివారం‌ ముగ్గురు మృతి చెందారు. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు, కర్నూలు సర్వజన ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకొని కోలుకున్నారు. అయితే అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలో యువకుడు శుక్రవారం, వృద్ధుడు శనివారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

  ఇదీ చదవండి: 8 నెలల గర్భిణి.. అయినా కరోనా విధుల్లో పాల్గొన్న అన్నపూర్ణ.. ఓ మగువా నీకు వందనం

  కర్నూలుకు చెందిన మరో యువకుడికీ బ్లాక్‌ ఫంగస్‌ రావడంతో మెరుగైన చికిత్సకు హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ మరణించినట్టు సమాచారం. రెండురోజుల కిందటే యువకుడి తండ్రి కొవిడ్‌తో చనిపోయాడు. గుంటూరు సమీపంలోని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 20 రోజుల కిందట కరోనా బారినపడ్డాడు. చికిత్స తరువాత కోలుకున్నా.. రెండు రోజుల్లోనే అతడికి బ్లాక్ ఫంగస్ లక్షాలు కనిపించాయి. మెరుగ చికిత్స కోసం హైదరాబాద్‌లోని కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించారు.

  ఇదీ చదవండి: RRR: ఎంపీ రఘరామ కృష్ణంరాజును కొట్టిందెవరు? సీఐడీ కస్టడీలో రాత్రి ఏం జరిగింది?

  శ్రీకాకుళం జిల్లాలోనూ ఓ ప్రైవేట్‌ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్‌ ఈ వ్యాధి బారిన పడినట్టు సమాచారం. నరసన్నపేట మండలం దాసరివానిపేట గ్రామానికి రామకృష్ణకు ఏప్రిల్ 3న కోవిడ్ నిర్దారణ అయ్యింది. ఆ వెంటనే ఆయనకు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో వారం రోజులు చికిత్స చేస్తే కోలుకున్నారు. గత నెల 14న డిశ్చార్జ్‌ అయ్యారు. తరువాత కొద్ది రోజులకు బ్లాక్‌ ఫంగస్‌ సోకినట్లు గుర్తించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాడు.

  బ్లాక్ ఫంగస్ రావడానికి కారణం ఏంటి?

  అయితే కోవిడ్ చికిత్సలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్‌ అందించేప్పుడు స్టెరైల్‌ నీటికి బదులు తేమ అందించే పరికరం ద్వారా అందించడం బ్లాక్‌ ఫంగస్‌కు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. హ్యుమిడిఫయర్లేలో స్టెరైల్‌ నీటినే ఉపయోగించాలి. కానీ, ప్రైవేటు ఆసుపత్రులు, కొవిడ్‌ ఐసోలేషన్‌ కేంద్రాలు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నవారు సాధారణ నల్లా నీటిని వాడేస్తున్నారు.

  బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఏంటి?
  ఎవరికైనా కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు, మానసిక సమస్యలు వంటి లక్షణాలు ఉంటే.... నాలికపై నల్లటి మచ్చలు ఉంటే... వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలను ఈ కేసులు భయపెడుతుండడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు