Home /News /coronavirus-latest-news /

BLACK FUNGUS CASES ARE INCREASING THIS IS THE TREATMENT HOSPITALS LIST IN ANDHRA PRADESH NGS

Black Fungus: ఏపీని భయపెడుతున్న బ్లాక్ ఫంగస్.. చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల జాబితా ఇదే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అసలే ఓ వైపు కరోనా కాటేస్తోంది.. ఇప్పుడు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. దీంతో ఏపీలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. బ్లాక్ ఫంగస్ కారణంగా మరణాల సంఖ్య కూడా పెరగడంతో ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వ్యాధిని ఆరోగ్యశ్రీలో చేర్చిన ప్రభుత్వం.. చికిత్స కోసం ప్రత్యేకంగా కొన్ని ఆస్పత్రులను కేటాయించింది..

ఇంకా చదవండి ...
    ఏపీని ఓ వైపు కరోనా వైరస్ వెంటాడుతోంది. మరోవైపు బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. దీంతో బ్లాక్ ఫంగస్ పై ఏపీ ప్రభుత్వం సైతం అలర్ట్ అయ్యింది. దీనిలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడటం వలన ఈ ఫంగస్ వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు అంచనాకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ కేసుల సంఖ్య పెరుగుతుండటం అందోళన కలిగిస్తోంది. కరోనా వచ్చి తగ్గిన వారిలో... వ్యాధి నిరోధక శక్తి తగ్గుతోంది. ఆ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు. ఏపీలో బ్లాక్ ఫంగస్ కట్టడిపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులను అప్రమత్తం చేస్తూ పలు సూచనలు చేస్తున్నారు.

    బ్లాక్ ఫంగస్ తీవ్రతను గుర్తించి ఏపీ ప్రభుత్వం.. ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఈ కేసులను వెంటనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం, ఈ వ్యాధి కోసం వాడే మందులను బాధితులకు సమకూర్చడంపై తక్షణం చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. విశాఖ, శ్రీకాకుళం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు ఇతర జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. కొత్తగా చాలామందిలో ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నా ఇంకా అధికారికంగా నిర్ధారిచాల్సిన అవసరం ఉంది.

    కరోనా నుంచి కోలుకున్న రోగులకు బ్లాక్ ఫంగస్ వ్యాధి సోకుతుండటం కలవరపెడుతోంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలోనే దీనికి చికిత్సను ఆరోగ్య శ్రీ పధకం కిందకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి సోకినవారికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించనుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 17 ఆసుపత్రుల్లో ‘బ్లాక్ ఫంగస్’వ్యాధికి చికిత్స అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    ఆ 17 ఆస్పత్రుల జాబితా ఇదే..
    జీజీహెచ్‌ అనంతపురం (ప్రభుత్వ వైద్య కళాశాల)
    ఎస్వీఆర్‌ఆర్‌జీజీహెచ్‌, తిరుపతి
    స్విమ్స్‌, తిరుపతి
    జీజీహెచ్‌, కాకినాడ (రంగరాయ మెడికల్‌ కళాశాల)
    జీజీహెచ్‌ గుంటూరు (ప్రభుత్వ వైద్య కళాశాల)
    జీజీహెచ్‌ (రిమ్స్‌) కడప
    జీజీహెచ్‌, విజయవాడ
    ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు
    జీజీహెచ్‌, కర్నూలు
    జీజీహెచ్‌ (రిమ్స్‌) ఒంగోలు
    జీజీహెచ్‌, నెల్లూరు (ఎసీఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్య కళాశాల)
    జీజీహెచ్‌ శ్రీకాకుళం (ప్రభుత్వ వైద్య కళాశాల)
    ప్రభుత్వ ఈఎన్‌టీ ఆస్పత్రి, విశాఖపట్నం
    ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆస్పత్రి, విశాఖపట్నం
    ప్రభుత్వ ఛాతి వ్యాధుల ఆస్పత్రి (ఆంధ్రా వైద్య కళాశాల)
    కేజీహెచ్‌, విశాఖపట్నం
    విమ్స్‌, విశాఖపట్నం
    ప్రస్తుతం ఈ 17 ఆస్పత్రుల్లోనూ బ్లాక్ ఫంగస్ కు చికిత్స చేస్తున్నారు.. రాబోయే రోజుల్లో కేసుల తీవ్రతను బట్టి ఆస్పత్రుల సంఖ్యను పెంచడంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Black Fungus, Corona cases, Corona deaths, Hospitals

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు