HOME »NEWS »Corona vilayatandavam »bjp national president jp nadda tests positive for covid 19 self isolates sk

JP Nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్.. వారంతా హోమ్ ఐసోలేషన్‌

JP Nadda: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా పాజిటివ్.. వారంతా హోమ్ ఐసోలేషన్‌
జేపీ నడ్డా (File)

JP Nadda: జేపీ నడ్డా త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు బీజేపీ నేతలు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు.

  • Share this:
    దేశంలో కరోనా కేసులు తగ్గముఖం పట్టినా.. ఇప్పటికీ పలువురు రాజకీయ నేతలు, సెలబ్రిటీలు వైరస్ బారినపడుతూనే ఉన్నారు. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా పరీక్ష అనంతరం రిపోర్టులో పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. కరోనా ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నా. రిపోర్టులో కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కోవిడ్ గైడ్‌లైన్స్‌ను పాటిస్తూ డాక్టర్ల సలహా మేరకు హోం ఐసోలేషన్‌లో ఉంటున్నా. ఇటీవల నన్ను కలిసి వారంతా హోమ్ ఐసోలేషన్‌లోనే ఉండండి. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి. అని హిందీలో ట్వీట్ చేశారు నడ్డా.

    జేపీ నడ్డా త్వరగా కోలుకోవాలని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, జ్యోతిరాదిత్య సింధియాతో పాటు పలువురు బీజేపీ నేతలు ట్విటర్ వేదికగా ఆకాంక్షించారు.



    కాగా, మనదేశంలో కరోనా తగ్గముఖం పట్టిన విషయం తెలిసిందే. గడిచిన 24 గంటల్లో 30,254 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 33,136 కోలుకోగా..391 మంది మరణించారు. తాజా లెక్కలతో భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 98,57,029కి చేరింది. ఇప్పటి వరకు 93,57,464 మంది కోలుకోగా.. కరోనా కాటుకు 1,43,019 మంది బలయ్యారు. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. నిన్న మన దేశంలో 10,14,434 మందికి కరోనా పరీక్షలు చేశారు. దాంతో ఇప్పటి వరకు చేసిన మొత్తం కరోనా టెస్ట్‌ల సంఖ్య 15 కోట్ల 37 లక్షల 11,833కి చేరింది.
    Published by:Shiva Kumar Addula
    First published:December 13, 2020, 18:10 IST