కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రూ.2కోట్ల విరాళాన్ని ప్రకటించారు. తన ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో నుంచి రూ.కోటి ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని కోరారు. విశాఖ జిల్లాకు రూ.25లక్షలు, కృష్ణా జిల్లాకు రూ.25 లక్షలు, ప్రకాశం జిల్లాకు రూ.25లక్షలు, గుంటూరు జిల్లాకు రూ.25 లక్షలు చొప్పున ఖర్చు చేయాలని కోరారు. ఇక తాను ఎన్నికైన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి మరో రూ.కోటి ఎంపీ ల్యాడ్స్ నిధులను కేటాయించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం అయిన వారణాశిలో కరోనా నివారణకు ఆ కోటి రూపాయలు ఖర్చు చేయాలని కోరారు. వీటితోపాటు ఏపీలో కరోనాపై పోరాటానికి ఎంపీగా తన నెల వేతనం రూ.లక్షను అందించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు లేఖ రాశారు.

తన ఎంపీల్యాడ్స్ నిధులు కేటాయించిన జీవీఎల్
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జీవీఎల్ నరసింహారావు ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాలకు తన నిధులను కేటాయించారు. రాజ్యసభ సభ్యులు దేశంలోని ఏ రాష్ట్రంలో అయినా తమ నిధులను వినియోగించే అవకాశం ఉంటుంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:March 28, 2020, 17:42 IST