షాకింగ్ న్యూస్.. కరోనా వైరస్ సోకి ఎమ్మెల్సీ మృతి..

షాకింగ్ న్యూస్.. కరోనా వైరస్ సోకి ఎమ్మెల్సీ మృతి..

ప్రతీకాత్మక చిత్రం

గతకొద్ది రోజులుగా సునీల్ సింగ్ కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్టుగా వైద్యులు పేర్కొన్నారు. అయితే మొదట్లో ఎమ్మెల్సీ వైరస్ బారి నుంచి కోలుకున్నట్టే కన్పించారని.. అయితే ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని తెలిపారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. అదే సమయంలో కరోనా వైరస్ సోకి చనిపోతున్నవారి సంఖ్య అధికంగానే ఉంటుంది. ఓ వైపు కరోనా నిర్మూలన కోసం ప్రపంచ దేశాలన్నీ మెడిసిన్ తయారుచేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో వైరస్ సోకి మరణాల సంఖ్య విపరీతంగానే ఉంటుంది. గతంలోనే పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే తమోనాశ్ ఘోష్(60) కరోనా వైరస్ సోకి చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా బీహార్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ కరోనా వైరస్ సోకి మృతిచెందాడు. పాట్నాఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారణ వైద్యులు ప్రకటించారు. గతకొద్ది రోజులుగా సునీల్ సింగ్ కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరినట్టుగా వైద్యులు పేర్కొన్నారు. అయితే మొదట్లో ఎమ్మెల్సీ వైరస్ బారి నుంచి కోలుకున్నట్టే కన్పించారని.. అయితే ఒక్కసారిగా గుండెపోటు వచ్చిందని తెలిపారు.

    ఎమ్మెల్సీ మృతితో బీహార్‌లో విషాదం నెలకొంది. సునీల్ సింగ్ మరణంపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ సంతాపం ప్రకటించారు. సునీల్ కుటుంబ సభ్యులను ఫోన్ ద్వారా పరామర్శించారు. బీహార్ బీజేపీ నేత సుశీల్ మోదీ సైతం సునీల్ మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలంటూ ట్విట్టర్ ద్వారా కోరారు. అయితే ఇప్పటికే కరోనాతో బీహార్ మండలి చైర్మన్‌కు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. అదే సమయంలో మరో నలుగురు ఎమ్మెల్యేలకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
    Published by:Narsimha Badhini
    First published: