news18
Updated: October 2, 2020, 4:55 PM IST
ప్రతీకాత్మక చిత్రం
- News18
- Last Updated:
October 2, 2020, 4:55 PM IST
కొద్దిరోజుల క్రితం బెంగాల్ లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యదర్శి అనుపమ్ హజ్రాకు ఊహించని షాక్ తగిలింది. గురువారం రాత్రి ఆయన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గురువారం ఉదయం నుంచి ఆయనకు ఒంట్లో అసౌకర్యంగా ఉండటంతో అనుమానం వచ్చి పరీక్షలు చేయించుకున్నాడు. అతడి నమూనాలను పరిశీలించిన వైద్యులు.. హజ్రాకు పాజిటివ్ గా తేలిందని నిర్ధారించారు.
గతంలో హజ్రా మాట్లాడుతూ.. తనకు కరోనా వస్తే మమతా బెనర్జీని హగ్ చేసుకుంటానని వ్యాఖ్యానించిన విషయం విదితమే. కరోనాను ఆమెకు కూడా అంటిస్తానని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు హజ్రా వైఖరిని తప్పుబట్టారు. ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే విషయమై బెంగాల్ లో హజ్రాపై కేసు కూడా నమోదైన విషయం తెలిసిందే.
Published by:
Srinivas Munigala
First published:
October 2, 2020, 4:50 PM IST