Bitcoin: బిట్ కాయిన్ ను వదలని కరోనా...క్రిప్టో కరెన్సీ మార్కెట్లో అల్లకల్లోలం...

ప్రతీకాత్మకచిత్రం

క్రిప్టో కరెన్సీలో అత్యధిక వాటా కలిగిన బిట్ కాయిన్ శుక్రవారం ఆసియా మార్కెట్ల పతనంతో ఏకంగా 25 శాతం పతనమయ్యాయి. ఇది గతంలో 5 ఏళ్ల క్రితం పతనమైన 22 శాతం కన్నా అధికం కావడం గమనార్హం.

  • Share this:
    కరోనా ధాటికి ఈక్విటీ మార్కెట్లే కాదు..అటు క్రిప్టో కరెన్సీలు సైతం చెల్లా చెదురు అయిపోతున్నాయి. ముఖ్యంగా గ్లోబల్ సెల్లాఫ్ క్రిప్టో కరెన్సీలను ముంచెత్తుతోంది. క్రిప్టో కరెన్సీలో అత్యధిక వాటా కలిగిన బిట్ కాయిన్ శుక్రవారం ఆసియా మార్కెట్ల పతనంతో ఏకంగా 25 శాతం పతనమయ్యాయి. ఇది గతంలో 5 ఏళ్ల క్రితం పతనమైన 22 శాతం కన్నా అధికం కావడం గమనార్హం. గడిచిన 5 రోజుల్లో బిట్ కాయిన్ విలువ 30 శాతం పతనమైంది. దీనిపై లండన్ బేస్డ్ క్రిప్టో సంస్థ ఎన్‌కేబీ పోర్ట్ ఫోలియో మేనేజర్ జామీ ఫార్కుహార్ స్పందిస్తూ అస్సెట్ మార్కెట్స్ లోని నిధులను పెద్ద మొత్తంలో ఉపసంహరించుకోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. అంతేకాదు బిట్ కాయిన్ కూడా కరోనాకు నిరోధకత కల్పించలేకపోతోందని చురకలు వేశారు. ఇదిలా ఉంటే అమెరికాలో కరోనా విజృంభించడంతో ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలానికి గురవుతున్నాయి. చైనాలో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ, అమెరికాలో మాత్రం కరోనా కేసులు పెరుగుతుండటంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనం ప్రారంభయ్యాయి.
    Published by:Krishna Adithya
    First published: