Night Curfew: బీహార్‌లో నైట్ కర్ఫ్యూ.. అన్నీ బంద్.. సీఎం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం

Night Curfew: బీహార్‌లో నైట్ కర్ఫ్యూ.. అన్నీ బంద్.. సీఎం నితీష్ కుమార్ సంచలన నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

బీహార్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. మే 15 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేశారు. సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, క్లబ్స్, పబ్లిక్ పార్క్‌లు మూసివేస్తున్నట్లు సీఎం నితీష్ ప్రకటించారు.

  • Share this:
    కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నాయి. పాక్షిక లాక్‌డౌన్‌తో పాటు రాత్రి కర్ఫ్యూలను విధిస్తున్నాయి. ఈ క్రమంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్ వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూతో కూడిన పాక్షిక  లాక్‌ డౌన్ విధించారు. కొన్నింటికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. ఆదివారం కరోనా వ్యాప్తిపై ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన సీఎం నితీష్ కుమార్ పలు అంశాలపై చర్చించారు. అనంతరం నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.



    బీహార్‌లో కఠిన ఆంక్షలు ఇవే:

    బీహార్‌లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ

    మే 15 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేత

    సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, క్లబ్స్, పబ్లిక్ పార్క్‌లు మూసివేత

    అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలకు సాయంత్రం 5 వరకే అనుమతి

    హెల్త్ కేర్ వర్కర్‌లకు ప్రోత్సాహకంగా ఒక నెల జీతం బోనస్

    కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌లుగా ప్రకటిస్తూ కఠిన ఆంక్షలు అమలు

    నిత్యావసర సరుకులు, మాంసం అమ్మే దుకాణాలు, మెడికల్ షాపులకు సాయంత్రం 6 గంటల వరకు అనుమతి

    రెస్టారెంట్లలో డైనింగ్‌కు అనుమతి లేదు. కేవలం హోమ్ డెలివరీకి మాత్రమే అనుమతి.

    అన్ని ప్రార్థనాలయాల మూసివేత.

    పెళ్లిళ్లకు 100 మంది, అంత్యక్రియలు 25 మంది మించకూడదు. సభలు, సమావేశాలకు అనుమతి లేదు.

    రద్దీ ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించాలని అన్ని జిల్లా కార్యాలయాలకు ఆదేశాలు జారీ.

    అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలతో పాటు ఈకామర్స్‌కు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు

    బీహార్‌లో కొత్త కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 8,690 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సీఎం నితీష్ కుమార్ వెల్లడించారు. ఈ క్రమంలోనే కఠిన ఆంక్షలను విధించారు.
    Published by:Shiva Kumar Addula
    First published: