హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కోవిడ్‌తో త‌ల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల‌కు నెల‌కు రూ.1500.. ఎక్కడంటే..

కోవిడ్‌తో త‌ల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల‌కు నెల‌కు రూ.1500.. ఎక్కడంటే..

కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ. 1,500 సాయం అందజేస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోయిన ఈ పథకం వర్తిస్తుంది.

  కోవిడ్ కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల‌కు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆర్థిక సాయం ప్రకటించారు. వారికి నెలకు రూ. 1,500 ఇవ్వనున్నట్టు తెలిపారు. బాల్ సహాయత యోజన కింద కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు ఈ సాయం అందజేయనున్నారు. ఈ మేరకు బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ట్విట్టర్‌ ద్వారా వివరాలను వెల్లడించారు. ‘కరోనా కారణంగా తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులకు నెలకు రూ. 1,500 సాయం అందజేస్తారు. తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చనిపోయిన ఈ పథకం వర్తిస్తుంది. చిన్నారులకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ప్రతి నెల ఈ ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది’అని నితీష్ కుమార్ ట్వీట్ చేశారు.

  అలాగే సంరక్షకులు లేకుండా అనాథలుగా మారిని పిల్లలను చిల్డ్రన్స్ హోమ్‌లోకి తీసుకోనున్నట్టు సీఎం నితీష్ కుమార్ చెప్పారు. అనాథలుగా మారిన బాలికలను ప్రాధాన్యతో కస్తుర్బా గాంధీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చుకోనున్నట్టు తెలిపారు.

  ఇక, బిహార్‌లో కరోనా కేసులు కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టాయి. రాష్ట్ర వైద్య శాఖ గణంకాల ప్రకారం బిహార్‌లో తాజాగా 1,491 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7.04 లక్షలకు చేరింది. కొత్తగా కరోనాతో 48 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 5,052కి చేరింది. బిహార్‌లో గతవారం రోజుల్లో కరోనా బారినపడి.. 600 మంది మృతిచెందారు. మరోవైపు దాదాపు 13 కోట్ల జనాభా ఉన్న బిహార్‌లో ఇప్పటివరకు 1.03 కోట్ల మందికి పైగా కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.

  First published:

  Tags: Bihar, Covid-19, Nitish Kumar

  ఉత్తమ కథలు