బీహార్ కొంప ముంచుతున్న వలసలు...చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా...

బీహార్ కొంప ముంచుతున్న వలసలు...చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా...

ప్రతీకాత్మక చిత్రం

బీహార్‌లోని 38 జిల్లాల్లో ఏప్రిల్ 14 వరకల్లా నమోదైన కేసులు 66 మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కేవలం 12 జిల్లాలకే కరోనా కేసులు పరిమితం అయ్యాయి. అయితే వలసలు ప్రారంభం కాగానే మే 2 వరకల్లా ౩౦ జిల్లాలకు విస్తరించి కేసుల సంఖ్య 475కు పెరిగింది.

 • Share this:
  లాక్ డౌన్ కారణంగా బీహార్‌కు చెందిన వలస కార్మికులు వేలాదిమంది పలు రాష్ట్రాల్లో చిక్కుకున్నారు. వారంతా తమ స్వస్థలాలకు వెళ్తామని ఘర్షణలకు సైతం దిగుతున్న విషయం తెలిసిందే. అయితే వారిని ప్రస్తుతం కేంద్రం, పలు రాష్ట్రప్రభుత్వాలు వారిని బీహార్ కు చేర్చే పనిలో పడ్డాయి. ఇదే బీహార్ లో కరోనా కేసులు అమాంతం పెరిగేందుకు దోహదపడుతోంది. ఈ దెబ్బతో బీహార్‌లో కరోనా బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బీహార్‌లోని 38 జిల్లాల్లో ఏప్రిల్ 14 వరకల్లా నమోదైన కేసులు 66 మాత్రమే నమోదు అయ్యాయి. అయితే కేవలం 12 జిల్లాలకే కరోనా కేసులు పరిమితం అయ్యాయి. అయితే వలసలు ప్రారంభం కాగానే మే 2 వరకల్లా ౩౦ జిల్లాలకు విస్తరించి కేసుల సంఖ్య 475కు పెరిగింది. ఈ పెరుగుదల ఏప్రిల్ 25 నుంచి మే 1 వరకు అంటే వారం రోజుల్లో 243 కేసులు నమోదు అయ్యాయి. పలు రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చిన వలస కార్మికుల వల్లే తమ రాష్ట్రంలో కొవిడ్19 బాధితుల సంఖ్య పెరిగిందని స్థానిక అధికారులు చెబుతున్నారు. బీహార్ ఉత్తర జిల్లాలైన మధుబని, దర్భంగా, సీతామరి, పూర్ణియా కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి.

  ఢిల్లీ నుంచి కారులో మధుబని జిల్లాకు వచ్చిన ఐదుగురికి కరోనా సోకినట్టు గుర్తించారు. వీరిలో ఓ మహిళ ద్వారా మరో మహిళకు, ఆమె ఇద్దరు పిల్లలకు సోకినట్టు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. నేపాల్‌కు సరిహద్దు జిల్లా కావడంతో ఆ దేశం నుంచి వెనక్కి వచ్చే వలస కార్మికుల వల్ల కరోనా విస్తరిస్తుందన్న ఆందోళన మధుబని జిల్లా అధికారుల్లో వ్యక్తమైంది.

  అనుమతి లేకుండా వచ్చే వారిని నిలువరించేందుకు నిఘాను పటిష్టం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. వలస కార్మికుల ఆందోళనతో వారిని స్వస్థలాలకు పంపేందుకు అనుమతించిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఫలితంగా పెద్ద సంఖ్యలో వలస కార్మికులు తిరిగి వస్తారని, వలస కార్మికుల్ని తరలిస్తున్న రైళ్లు, బస్సుల్ని శానిటైజ్ చేస్తున్నప్పటికీ, ఎక్కడ ఏ కొంచెం తేడా వచ్చినా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ తన ప్రతాపం చూపే ప్రమాదం ఉందని అధికారులు భయపడుతున్నారు.
  Published by:Krishna Adithya
  First published: