AP Curfew Alert: ఏపీలో ఉద్యోగులకు ఊరట.. కర్ఫ్యూ టైంలో సీఎం జగన్ కీలక నిర్ణయం

ప్రతీకాత్మక చిత్రం

ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కల్పించింది ప్రభుత్వం.. ఓ వైపు కరోనా బారిన పడుతున్న ఉద్యోగుల సంఖ్య పెరగడం.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కఠిన కర్ఫ్యూ తో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం.. కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేసింది.

  • Share this:
    ఏపీని కరోనా వెంటాడుతోంది. రోజు రోజుకూ కరోనా కేసులు ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే 24 గంటల్లో 20 వేలకు తగ్గకుండా కరోనా బారిన పడుతున్నారు. దీంతో తప్పని సరిపరిస్థిలో కఠిన ఆంక్షలు విధించింది ఏపీ ప్రభత్వం. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పగటి కర్ఫ్యూ మూడో రోజూ కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ఆంక్షలతో రోడ్లన్నీ పూర్తిగా నిర్మాణుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠిన కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉండడంతో కంటైన్మెంట్ జోన్లను గుర్తించి.. అక్కడ సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

    ఇక కర్ఫ్యూ  తొలి రెండు రోజులు ఆంక్షలు ఉన్నా.. అక్కడక్కడా ప్రజలు రోడ్లపైకి వచ్చే ప్రయత్నం చేశారు. కొన్ని చోట్ల  షాపులు మూసేందుకు వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. అయితే అలాంటి వారికి పోలీసులు అవగాహన కల్పించారు. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని.. ప్రజల క్షేమం కోసమే కర్ఫ్యూ పెట్టామని సుతి మెత్తగా చెప్పే ప్రయత్నం చేశారు. అయినా వినని వారికి వార్నింగ్ ఇచ్చారు.. ఇదే ఫైనల్ వార్నింగ్ అని.. మరోసారి 12 గంటల దాటిన తరువాత రోడ్డుపై కనిపిస్తే కేసులు వేస్తామని హెచ్చరించారు. దీంతో మూడో రోజు చాలాచోట్ల రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారాయి. లాక్ డౌన్ నాటి పరిస్థితులు కనిపించాయి.

    ప్రస్తుతం అత్యవసర పనిమీద వెళ్లేవారిని.. అలాగే ప్రభుత్వం అనుమతి ఇచ్చిన రంగాల వారు తమ గుర్తింపు కార్డులు చూపిస్తే వారికి బయటకు వెళ్లేందుకు అనుమతి ఇస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇబ్బంది కరంగా మారింది. ఇప్పటికే చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ముఖ్యంగా సచివాలయంలో గత 10 రోజుల్లో 14 మంది ఉద్యోగులు కరోనా సోకి మరణించారు. దీంతో అప్పటి నుంచి ఉద్యోగులు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.

    తమకు వర్క్ ఫ్రం హోమ్ కు అవకాశం ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు కర్ఫ్యూ కఠినంగా అమలవడంతో కార్యాలయాల నుంచి ఇంటికి చేరుకునే సమయంలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్ఫ్యూ టైంలో ఉద్యోగుల ఇబ్బంది దృష్ట్యా ఏపీ ప్రభుత్వం మరో నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల పనివేళలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. కర్ఫ్యూ నేపథ్యంలో ఉద్యోగుల పనివేళలు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు ఉండాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని హెచ్‌డీవో కార్యాలయాలు, సెక్రటెరియట్‌, జిల్లా కార్యాలయాలు, సబ్‌ డివిజన్‌ కార్యాలయాల్లో ఈ మేరకు అమలులో రానుంది. మధ్యాహ్నం 12 గంటల తరువాత ఉండాలంటే ఉద్యోగులకు కచ్ఛితంగా పాసులు కలిగి ఉండాలని అధికారులు తెలిపారు.
    Published by:Nagesh Paina
    First published: