చేతులెత్తి మొక్కుతున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి...

కరోనా వైరస్ తగ్గే వరకు తెలంగాణ గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులు బంద్ చేయాలని భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: August 5, 2020, 9:02 PM IST
చేతులెత్తి మొక్కుతున్నా.. తెలంగాణ ప్రభుత్వానికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి...
భట్టి విక్రమార్క (File)
  • Share this:
తెలంగాణ ప్రభుత్వానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేతులెత్తి నమస్కరించారు. కరోనా వైరస్ తగ్గే వరకు గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులు బంద్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కరోనా భయంతో బిక్కు బిక్కుమంటూ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉంటే సీఎం కేసీఆర్ ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. అసెంబ్లీ సాక్షిగా కరోనా వైరస్ పై అవహేళన చేసిన కేసీఆర్ ఇప్పుడు ఫాంహౌస్ దాటి బయటికి రావడం లేదన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ లో కరోనా వైద్యానికి ఒక రేట్ ఫిక్స్ చేసి ప్రభుత్వమే ఆ డబ్బులను చెల్లించలేదా అని ప్రశ్నించారు. అంత దీనమైన పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉందా అని నిలదీశారు. ఐఏఎస్, ఐపీఎస్ లతో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఫీజులు నియంత్రణకు చర్యలు తీసుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి చేతకావడం లేదా అని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ మీద భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. సర్పంచులు, ఎంపీటీసీలు ప్రారంభించాల్సిన పనులను మంత్రి ప్రారంభిస్తూ ఇదే అభివృద్ధి అనే విధంగా వ్యవహరించడం చాలా దారుణమన్నారు. మంత్రి పువ్వాడ ప్రారంభించిన టెస్టింగ్ సెంటర్ ఖమ్మం జిల్లా గవర్నమెంట్ హాస్పటల్ లోనే ఇంకా ప్రారంభం కాకపోవడం ఆయన అసమర్ధతకు నిదర్శనమన్నారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో కనీసం సగానికి సగం అయినా డాక్టర్స్, స్టాఫ్ లేకపోవడం చాలా దారుణమన్నారు. అలాగే ఉన్నవారికి పని ఒత్తిడి వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొంతమంది కరోనా వైరస్ బారిన కూడా పడుతున్నారని చెప్పారు. అయినా మంత్రి పువ్వాడ తగినంత సిబ్బందిని ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యారన్నారు.

మంత్రి పువ్వాడ ప్రారంభించిన మద్దులపల్లి క్వారంటైన్ సెంటర్లో చేరిన ప్రముఖ సామాజిక వేత్త అన్నం వెంకటేశ్వర్లు అక్కడి దారుణ పరిస్థితులను వివరించి బయటకు వస్తే.. ఆ సెంటర్లో ఏర్పాట్లు చేయాల్సింది పోయి..వెంకటేశ్వర్లును మాత్రం తన హాస్పిటల్ కి పంపించు కోవడం చాలా విచారకరం అన్నారు. ఆ క్వారంటైన్ సెంటర్లో ఉన్న మిగిలిన వారు మనుషులు కాదా అని ప్రశ్నించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న డాక్టర్స్ , సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని భట్టి డిమాండ్ చేశారు. గ్రామాల వారీగా ప్రతి ఒక్కరికి కరోనా టెస్ట్ నిర్వహించి వారిలో ఆరోగ్యశ్రీ కిందికి వచ్చే వారిని ప్రభుత్వమే ఖర్చు భరించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading