HOME »NEWS »Corona vilayatandavam »bharat biotech once again applied for emergency approval of it corona vaccine covaxin ak

CoronaVirus Vaccine: కరోనా వ్యాక్సిన్.. మరోసారి దరఖాస్తు పెట్టుకున్న భారత్ బయోటెక్

CoronaVirus Vaccine: కరోనా వ్యాక్సిన్.. మరోసారి దరఖాస్తు పెట్టుకున్న భారత్ బయోటెక్
ప్రతీకాత్మక చిత్రం

CoronaVirus Vaccine: ప్రస్తుతం కోవాగ్జిన్ దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 26 వేల మంది వాలంటీర్లపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది.

  • Share this:
    కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారీలో నిమగ్నమైన భారత్ బయోటెక్.. ఈ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ)కు మరోసారి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోవాగ్జిన్ దేశవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 26 వేల మంది వాలంటీర్లపై మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఒకటి, రెండు దశల్లో వెయ్యి మంది వాలంటీర్లపై ప్రయోగాలు నిర్వహించిన భారత్ బయోటెక్.. మూడో దశలో మరింత మందిపై ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ నెల 7న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగం కోసం దరఖాస్తు చేసుకుంది.

    అయితే సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ప్యానల్ బృందం మాత్రం వ్యాక్సిన్ భద్రత, ఇతర సమాచారానికి సంబంధించి మరింత సమాచారం ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉంటే ఇప్పటికే తాము రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని పుణెకు చెందిన సీరమ్ ఇన్స్‌టిట్యూట్ డీజీసీఐకు సమర్పించింది. ఇదిలా ఉంటే డిసెంబర్ చివరి నాటికి సీరమ్ సంస్థతో పాటు ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.



    డిసెంబర్ 4న అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ భారత్‌లో వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసుకోగా, సీరమ్ సంస్థ, భారత్ బయోటెక్‌లు సైతం ఆ తరువాత ఇందుకోసం దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఫైజర్ కంపెనీ తమ వ్యాక్సిన్ సమాచారాన్ని ఇచ్చేందుకు మరింత సమయం కోరింది. ఇప్పటికే ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ను అమెరికా, బ్రిటన్‌తో పాటు కెనెడా దేశాలు ఆమోదించాయి. అయితే భారత్‌లో మాత్రం ఆ కంపెనీ డీజీసీఐ కోరిన సమాచారం ఇవ్వకపోవడంతో.. వ్యాక్సిన్‌కు ఆమోదం లభించలేదు.
    Published by:Kishore Akkaladevi
    First published:December 23, 2020, 21:35 IST

    टॉप स्टोरीज