Covaxin: బ్రెజిల్‌కు హైదరాబాద్ నుంచి కరోనా వ్యాక్సిన్ సరఫరా.. భారత్ బయోటెక్ బిగ్ డీల్

Covaxin: బ్రెజిల్‌కు హైదరాబాద్ నుంచి కరోనా వ్యాక్సిన్ సరఫరా.. భారత్ బయోటెక్ బిగ్ డీల్

కొవాగ్జిన్ టీకా

భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా తమ అంచనాలను మించి ఉందని బ్రెజిల్‌ ఫార్మా సంస్థ డెరెక్టర్‌ ఎమాన్యూయేల్‌ మెడ్రాడెస్‌ తెలిపారు. భారత్‌ బయోటెక్‌తో చేసుకున్న ఈ ఒప్పందం తమకు ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు.

  • Share this:
    తొలి స్వదేశీ వ్యాక్సిన్ కొవాగ్జిన్ హైదరాబాద్‌లో అభివృద్ధి కావడంతో.. ప్రపంచవ్యాప్తంగా మన నగరం పేరు మార్మోగిపోతోంది. ఇప్పటికే మన దేశంలో కొవాగ్జిన్ వినియోగానికి డీసీజీఐ షరతులతో అనుమతులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో విదేశాలు కూడా కొవాగ్జిన్ కోసం ఎగబడుతున్నాయి. కరోనాతో విలవిల్లాడుతున్న బ్రెజిల్ దేశం.. కరోనా వాక్సిన్ కోసం భారత్‌‌ను సంప్రదించింది. భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా తీసుకునేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు భారత్‌ బయోటెక్ కంపెనీతో బ్రెజిల్ మెడికల్ ఏజెన్సీ ప్రెసిసా మెడికామెంటోస్‌ ఒప్పందం కుదుర్చుకుతంది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం భారత్ బయోటెక్ ప్రకటన విడుదల చేసింది.

    జనవరి 7, 8 తేదీల్లో ప్రెసిసా మెడికామెంటోస్ ప్రతినిధులు హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కార్యాలయాన్ని సందర్శించినట్లు ఈ సంస్థ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్ల తెలిపారు. వాక్సిన్ వివరాలు, సరఫరా సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. కొవాగ్జిన్ సమర్థవంతమైనదని తేలడంతో పాటు రోగనిరోధక శక్తి పెంపొందించడంలోనూ మంచి పనితీరు కనబరించిందని కృష్ణ వెల్లడించారు. బ్రెజిల్ ప్రజల ఆరోగ్య అవసరాలకు కొవాగ్జిన్ ఉపయోగడుతున్నందుకు సంతోషంగా ఉందని చెప్పారు.

    భారత్‌ బయోటెక్‌ తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ తమ అంచనాలను మించి పనిచేస్తోందని బ్రెజిల్‌ ఫార్మా సంస్థ డెరెక్టర్‌ ఎమాన్యూయేల్‌ మెడ్రాడెస్‌ తెలిపారు. భారత్‌ బయోటెక్‌తో చేసుకున్న ఈ ఒప్పందం తమకు ఎంతగానో దోహద పడుతుందని పేర్కొన్నారు. ఐతే బ్రెజిల్‌ ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా వ్యాక్సిన్‌ పంపిణీ కోసం ప్రయత్నిస్తున్నాయి. వారంతా బ్రెజిల్‌ నియంత్రణ సంస్థ 'అన్విసా' నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.


    కాగా, మన దేశంలో SII తయారుచేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వాక్సిన్‌లకు డీసీజీఐ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు సంస్థల నుంచి టీకాలను కేంద్రం కొనుగోలు చేస్తోంది. తొలిదశ వ్యాక్సినేషన్ కోసం..కోవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్‌లకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. సీరం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి 1.10 కోట్ల కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులను సేకరిస్తోంది. ఒక్కో డోసు ధర రూ.200 గా ఉన్నట్లు వెల్లడించింది. అటు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌‌ను 55లక్షల డోసుల మేర కేంద్రం కొనుగోలు చేస్తోంది. వీటిలో 38.5లక్షల డోసుల వ్యాక్సిన్‌కు ప్రతి డోసుకు రూ.295 ధర చెల్లించనుంది. మరో 16.5 లక్షల డోసులను మాత్రం భారత్‌ బయోటెక్‌ ఉచితంగానే అందిస్తోంది.అంతే కొన్ని టీకాలను ఉచితంగా ఇవ్వాలని ఇరు కంపెనీలకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.


    భారత్‌లో జనవరి 16 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం కానుంది. తొలి దశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకా వేయనున్నారు. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుంది. పీఎం కేర్స్ నుంచి అందుకోసం నిధులను కేటాయించినట్లు తెలిసింది. రెండో దశలో 50 ఏళ్ల పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకా వేయనున్నారు. ఆ తర్వాతే ఇతరులకు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. దాదాపు సంవత్సరం పాటు ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగనుంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు