Child Adoption: చిన్నారుల దత్తతపై నకిలీ వార్తలు.. అప్రమత్తంగా ఉండాలి.. బాలల హక్కుల కమిషన్

Child Adoption: చిన్నారుల దత్తతపై నకిలీ వార్తలు.. అప్రమత్తంగా ఉండాలి.. బాలల హక్కుల కమిషన్

(image credit - twitter)

ఈమ‌ధ్య త‌మిళ‌నాడులో సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఒక‌ వార్త వైర‌ల్ అయ్యింది. కోవిడ్ కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి, ఒంటిరిగా మిగిలిన చిన్నారుల‌ను ఎవ‌రైనా ద‌త్త‌త తీసుకోవాలంటూ వార్త చ‌క్క‌ర్లుకొట్టింది. అయితే సోష‌ల్ మీడియాలో ఫార్వర్డ్ అయిన ఈ వార్త నకిలీదని ఆ రాష్ట్ర బాల‌ల హ‌క్కుల కమీషన్ అధికారులు ప్ర‌క‌టించారు.

  • Share this:
క‌రోనా విల‌య‌తాండ‌వంలో ఎంతో మంది సామాన్య ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒక కుటుంబంలోనే ఒక‌రికంటే ఎక్కువ మంది కోవిడ్ బారిన‌ప‌డి మ‌ర‌ణిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో బాధిత కుటుంబ స‌భ్యులు, బంధువ‌ర్గం శోకంలో మునిగిపోతున్నారు. ఇక త‌ల్లిదండ్రులిద్దరూ చ‌నిపోయి పిల్ల‌లు అనాధ‌లుగా మిగులుతున్న సంద‌ర్భాలూ క‌నిపిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్ని అవ‌కాశంగా వాడుకుంటున్నారు కొంద‌రు వ్య‌క్తులు. ఈమ‌ధ్య త‌మిళ‌నాడులో సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఒక‌ వార్త వైర‌ల్ అయ్యింది. కోవిడ్ కార‌ణంగా త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి, ఒంటిరిగా మిగిలిన చిన్నారుల‌ను ఎవ‌రైనా ద‌త్త‌త తీసుకోవాలంటూ వార్త చ‌క్క‌ర్లుకొట్టింది. అయితే సోష‌ల్ మీడియాలో ఫార్వర్డ్ అయిన ఈ వార్త నకిలీదని ఆ రాష్ట్ర బాల‌ల హ‌క్కుల కమీషన్ అధికారులు ప్ర‌క‌టించారు.

సోష‌ల్ మీడియాలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఈ మెసేజ్‌లో.. రెండేళ్ల పాప, మరో చిన్నారి త‌ల్లిదండ్రులు కోవిడ్‌-19 సోకి మ‌ర‌ణించారని ఉంది. వారిని ఎవ‌రైనా ద‌త్త‌త తీసుకోమంటూ కోరుతున్నట్లు ఉంది. అయితే ఇది అధికారిక ప్రకటన కాదని బాల‌ల హ‌క్కుల కమీషన్ స‌భ్యులు వెల్ల‌డించారు. ఒక ఫేక్ మొబైల్ నెంబ‌ర్ నుంచి ఈ వార్తను పంపించి, సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. త‌మిళ‌నాడు క‌మీష‌న్ ఫ‌ర్ ప్రొటెక్ష‌న్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (TNCPCR) స‌భ్యులు వి.రామరాజ్ దీనిపై బ‌హిరంగ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. చిన్నారుల ద‌త్త‌త‌కు సంబంధించిన నకిలీ సోష‌ల్ మీడియా మెసేజ్‌లు ఫార్వర్డ్ చేయొద్ద‌ని ఆయ‌న ప్ర‌జ‌లంద‌రికీ విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌భుత్వ అనుమ‌తి లేకుండా ద‌త్త‌త తీసుకోవ‌డం నేర‌మ‌ని చెప్పారు.

పిల్లల్ని ద‌త్త‌త తీసుకోవాల‌నుకునే వారు చ‌ట్ట‌ప్రకారం సంప్రదించాలని రమారాజ్ కోరారు. దీని కోసం సెంట్ర‌ల్ అడాప్ష‌న్ రిసోర్స్ అధారిటీ (CARA) నుంచి, అలాగే స్టేట్ అడాప్ష‌న్ రిసోర్స్ అథారిటీ (SARA) నుంచి అనుమ‌తులు తీసుకోవ‌డం అవ‌స‌రం. ద‌త్త‌త తీసుకోవ‌డం గురించిన వివ‌రాల కోసం జిల్లా బాల‌ల ర‌క్ష‌ణ కార్యాల‌యాన్ని సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని వెల్ల‌డించారు. ఇలాంటి అబ‌ద్ద‌పు వార్త‌ల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అమాయకుల్ని మోసం చేసే వ్య‌క్తులు, వార్త‌ల ప‌ట్ల త‌గిన‌ జాగ్ర‌త్త వ‌హించాలంటూ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.
Published by:Krishna Adithya
First published: