కరోనాను క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ బంగార్రాజులు

ప్రతి రోజూ సాయంత్రం కరోనా బులిటిన్‌ విడుదల అయిన తర్వాత ఆ సంఖ్యను చూసి ఆ తర్వాత గెలిచిన వ్యక్తి ఖాతాకు నగదును ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని తెలుస్తోంది.

news18-telugu
Updated: July 13, 2020, 8:50 AM IST
కరోనాను క్యాష్ చేసుకుంటున్న బెట్టింగ్ బంగార్రాజులు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కారణంగా ఎన్నికలు, క్రికెట్ సహా బెట్టింగ్ బిజినెస్‌కు అనుకూలంగా ఉండే అన్నీ దాదాపుగా బంద్ అయిపోయాయి. దీంతో ఏం చేయాలో తోచని బెట్టింగ్ బంగార్రాజులు... ఏకంగా కరోనా మీదే బెట్టింగ్‌లు కాస్తున్నారు. కరోనాపై బెట్టింగ్ ఏమిటి ? అసలు కరోనాపై బెట్టింగ్ ఎలా పెడతారు ? వినడానికి ఇది కాస్త ఆశ్చర్యంగానే ఉన్నా.. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ఇలాగే జరుగుతోందనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో ఏ రోజు ఏ ప్రాంతంలో ఎన్ని కరోనా కేసులు వెలుగు చూస్తాయనే దానిపై ముందుగానే పందాలు కాస్తున్నారు కొందరు బెట్టింగ్ రాయుళ్లు. ఈ రోజు ఎన్ని కేసులు నమోదు అవుతాయి ? వెయ్యినా లేదా రెండు వేలా అంటూ బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయని సమాచారం.

ప్రతి రోజూ సాయంత్రం హెల్త్‌ బులిటిన్‌ విడుదల అయిన తర్వాత ఆ సంఖ్యను చూసి ఆ తర్వాత గెలిచిన వ్యక్తి ఖాతాకు నగదును ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇలాంటి బెట్టింగులు కర్ణాటకలోని పాత మైసూరు, చామరాజనగర, ఇతర స్థలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో జోరుగా సాగుతున్నాయని సమాచారం. ఈ బెట్టింగ్‌లు కేవలం రూ 100, రూ 500, రూ. 1000 మేర తక్కువ మొత్తంలో జరుగుతుండడం వల్ల పోలీసుల దృష్టికిపెద్దగా రావడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా... కరోనా కేసుల మీద కూడా బెట్టింగ్‌లు పెడుతున్నారంటే... బెట్టింగ్‌లకు మనోళ్లు ఎంతగా అలవాటు పడిపోయారో అర్థం చేసుకోవచ్చు. .
Published by: Kishore Akkaladevi
First published: July 13, 2020, 8:36 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading