పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. వ్యక్తి దుర్మరణం..

నిత్యావసరాల సరుకులు, అత్యవసర సేవల కోసం మినహా బయట తిరిగితే పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. అయితే, కారణం చెబుతున్నా ఇష్టమొచ్చినట్లు కొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

news18-telugu
Updated: March 26, 2020, 1:45 PM IST
పాల ప్యాకెట్ కోసం వచ్చినందుకు పోలీసుల దాడి.. వ్యక్తి దుర్మరణం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలోని అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించాయి. నిత్యావసరాల సరుకులు, అత్యవసర సేవల కోసం మినహా బయట తిరిగితే పోలీసులు లాఠీలకు పని చెప్తున్నారు. అయితే, కారణం చెబుతున్నా ఇష్టమొచ్చినట్లు కొడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. పశ్చిమ బెంగాల్‌లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఓ వ్యక్తి పాల కోసం స్థానిక దుకాణానికి వెళ్లినందుకు ఓ పోలీస్ అధికారి అతడ్ని చితకబాదాడు. పాల కోసం వచ్చానని చెబుతున్నా, లాక్ డౌన్ ఉన్నపుడు బయటికి ఎందుకు వచ్చావంటూ దాడి చేశాడు.

ఈ ఘటన హౌరా ప్రాంతంలో చోటుచేసుకుంది. లాల్ స్వామి(32) అనే వ్యక్తి పాల కోసం రోడ్డు మీదకి రాగా, అటుగా పెట్రోలింగ్ కోసం వచ్చిన పోలీసులు అతడ్ని ఆపి లాఠీలతో కొట్టారు. ఈ దాడిలో స్వామి స్పృహ కోల్పోయాడు. స్థానికులు అతడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా, చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై కుటుంబ సభ్యులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

First published: March 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు