కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా పెను మార్పులే సృష్టించింది. వ్యాపార, వాణిజ్యం, విద్య ఒక్కటేమిటి అన్నిరంగాలపై దీని ప్రభావం తీవ్రంగా పడింది. అంతేకాకుండా మనుషుల ప్రవర్తనలోనూ పలు మార్పులకు కారణమైంది. ముఖ్యంగా వైద్యం, ఆరోగ్యం విషయంలో వ్యక్తుల ఆలోచన విధానం మారింది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ పంపిణీ వేగంగా జరుగుతోన్న తరుణంలో కరోనాంతర(Post Panademic Stress) ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ ఆందోళనను అధిగమించేందుకు కంబోడియాలోని కొంత మంది దీనికి సరైన పరిష్కారాన్ని కనుగొన్నారు. ఇందుకోసం వారు బీరు యోగాను ప్రారంభించారు. వినడానికి కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజం. వివరాల్లోకి వెళ్తే కంబోడియా రాజధాని ఫెనం పెన్ నగరంలో ఒక్క మరణం కూడా సంభవించని కారణంగా టూబర్డ్స్ క్రాఫ్ట్ బీర్ బ్రూవరీ సంస్థ కరోనా లాక్ డౌన్ తర్వతా తన సేవలను పునఃప్రారంభించింది. ఈ నేపథ్యంలో అక్కడ కొంతమంది చేతిలో ఓ గ్లాసు బీరు తీసుకొని విభిన్నమైన భంగిమలతో ఫోజులిస్తున్నారు. స్థానికులే కాకుండా విదేశీయులు కూడా ఈ ఫోజులు పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి భంగిమ తర్వాత తమ గ్లాసులోని బీరును సిప్ చేయడమే దీని ప్రత్యేకత.
కంబోడియా అంతటా ఆరు వారాల లాక్ డౌన్ తర్వాత బ్రూవరీ యోగా తరగతులు ప్రారంభయ్యాయి. కోవిడ్-19తో ఒక్క మరణం కూడా సంభవించని కారణంగా జనవరి 1న ఇక్కడ లాక్ డౌన్ ఎత్తివేశారు. భంగిమ వేయండి.. బీరు పట్టుకోండి తరహాలో అక్కడ ప్రజలు చాలా మందిని ఆకర్షిస్తున్నారు. తాను బీరు యోగాను బాగా ఆస్వాదించానని, ఇది అంత తీవ్రంగా ఉండదని 25 ఏళ్ల శ్రేలైన్ బాచా తెలిపారు. ఇది నిజమైన యోగా ప్రాక్టీస్ లా లేదని, వినోదం కోసం యోగా కదలికలను స్నేహితులను కలిసి చేయడం లాంటిదని రెండు నెలల క్రితం కంబోడియాకు వచ్చిన ఓ పర్యాటకురాలు చెప్పింది.
పని తర్వాత ప్రజలను ఇక్కడకు వచ్చి సరదాగా ఈ యోగాలో పాల్గొంటున్నారని టూబర్డ్స్ సంస్థ యజమానుల్లో ఒకరైన చెనీ కిర్ష్ తెలిపారు. అయితే బీరు యోగా ఇప్పుడు కొత్తగా పెట్టిందేమి కాదు. 2013లో అమెరికాలో బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్లో తొలుత ప్రవేశపెట్టారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.