హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

బ్యాంక్ ఈఎంఐలు ఆరు నెలల పాటు రద్దు చేయాలి...సోనియా డిమాండ్..

బ్యాంక్ ఈఎంఐలు ఆరు నెలల పాటు రద్దు చేయాలి...సోనియా డిమాండ్..

సోనియా గాంధీ (ఫైల్ చిత్రం)

సోనియా గాంధీ (ఫైల్ చిత్రం)

ఆరు నెలల పాటు ఈఎంఐలను రద్దు చేయాలని, అలాగే ఈఎంఐపై ఆ తర్వాత వడ్డీకూడా రద్దు చేయాలని సోనియా కోరారు. అలాగే కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందన్నారు.

కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో పేద, మధ్య తరగతి వర్గాలు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్లకు ఈఎంఐలు చెల్లించడంలో ఇబ్బందులు పడతారని, అందుకే వారికి కష్టకాలంలో ఇతోధికంగా సహాయపడేందుకు కేంద్రం చర్యలు చేపట్టాలని లేఖలో కోరారు. అందులో ప్రధానంగా ఆరు నెలల పాటు ఈఎంఐలను రద్దు చేయాలని, అలాగే ఈఎంఐపై ఆ తర్వాత వడ్డీకూడా రద్దు చేయాలని కోరారు. అలాగే కరోనా వైరస్‌ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందన్నారు. కరోనా మహమ్మారిపై విజయానికి దేశం ఒక్కతాటిపై నిలిచి పోరాడాలని పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలకోసం కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది రక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేశ వ్యాప్తంగా సరకు రవాణాను సులభతరం చేయాలని కోరారు.

First published:

Tags: Coronavirus, Sonia Gandhi

ఉత్తమ కథలు