ఏపీలో తొలిసారి ఓ మంత్రికి కరోనా పాజిటివ్...

ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా బారిన పడ్డారు.

news18-telugu
Updated: August 5, 2020, 6:22 PM IST
ఏపీలో తొలిసారి ఓ మంత్రికి కరోనా పాజిటివ్...
బాలినేని శ్రీనివాస రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కరోనా బారిన పడ్డారు. కొన్నాళ్ల నుంచి ఆయన స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో మంత్రి బాలినేని కరోనా పరీక్షలు చేయించుకున్నారు. మొదట నెగిటివ్ వచ్చింది. అయినా, మళ్లీ జ్వరం రావడంతో మరోసారి టెస్టులు చేయించుకోగా, బాలినేనికి కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో ఉన్నారు. కొన్ని రోజులుగా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న బాలినేని ఇప్పుడు అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, అపోలోలో చికిత్స పొందుతున్నానని, త్వరలోనే ఇంటికి చేరుకుంటానని పార్టీ నాయకులు, కార్యకర్తలకు బాలినేని మెసేజ్ పంపారు.

వైసీపీకి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఎంపీ, విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కిలారి రోశయ్య, అన్నాబత్తుని శివకుమార్, బియ్యపు మధుసూదన్ రెడ్డి, సంజీవయ్య కరోనా వైరస్ బారిన పడ్డారు. మరికొందరు ప్రజాప్రతినిధులు కరోనా నుంచి కోలుకున్నారు.

రెండు రోజుల క్రితం మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు కరోనా బారిన పడి చనిపోయారు. సుమారు నెల రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్సపొందిన మాణిక్యాలరావు చివరకు కన్నుమూశారు. ఆయనకు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 6:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading