హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

కరోనా మహామ్మారిపై పోరాడుతున్న వైద్యులకు బాలకృష్ణ సెల్యూట్..

కరోనా మహామ్మారిపై పోరాడుతున్న వైద్యులకు బాలకృష్ణ సెల్యూట్..

బాలకృష్ణ న్యూ లుక్ (balakrishna new look)

బాలకృష్ణ న్యూ లుక్ (balakrishna new look)

కరోనా.. ఇపుడు పేరు చెబితేనే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. తాజాగా ఈ వైరస్ మహామ్మారిపై సీనియర్ టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ స్పందించారు.

  కరోనా.. ఇపుడు పేరు చెబితేనే ప్రపంచం చిగురుటాకులా వణికిపోతుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇపుడు దాదాపు అన్ని దేశాలనే చుట్టేసింది. అంతేకాదు ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను చిన్నాభిన్నాం చేసింది. దీంతో అప్రమత్తమైన జనం పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. రైళ్లు, బస్సులు, విమానాలు ఎక్కడక్కడి క్కడ స్థంభించిపోయాయి. కరోనా దెబ్బకు బీదా, గొప్ప, ఆడా, మగా తేడా లేకుండా అందరు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో దాదాపు పరిశ్రమలు స్థంభించిపోయాయి. ఈ కరోనా మహామ్మారిపై పోరాటంలో ఎంతో మంది వైద్యులు పగలు రాత్రి అనే తేడా లేకుండా తమ శక్తి మించి పనిచేస్తున్నారనే చెప్పాలి. తాజాగా ఈ వైరస్ మహామ్మారిపై సీనియర్ టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ స్పందించారు. కరోనా ఇంతకు ముందు ప్రపంచం ఇలాంటి కల్లోల పరిస్థితిని ఎపుడు చూడలేదు. కరోనా మహామ్మారి వల్ల ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ క్లిష్ట సమయంలో మనమందరం బాధ్యతయుతమైన పౌరులుగా మెలగాలని పిలుపునిచ్చారు.

  balakrishna Nandamuri open letter to fight against Coronavirus and appreciate doctors,Balakrishna Nandamuri,balakrishna selute to doctors,Balayya coronavirus,nbk,balakrishan indo american cancer hospital doctors,balakrishna facebook,balakrishna boyapati movie,balakrishna appreciate docotors,balakrishna covid 19,balakrishna corona virus,balakrishna twitter,tollywood,telugu cinema,బాలకృష్ణ నందమూరి,బాలకృష్ణ కోవిడ్ 19,బాలకృష్ణ కరోనా వైరస్,డాక్టర్లను మెచ్చుకున్న బాలయ్య,డాక్టర్లకు బాలకృష్ణ అండదండలు,బాలకృష్ణ ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పటల్,
  డాక్టర్లను అభినందిస్తూ బాలకృష్ణ లెటర్ (Twitter/Photo)

  ముఖ్యంగా తన అధ్వర్యంలో నడుస్తోన్న ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు పగలు రాత్రి తేడా లేకుండా అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. వీళ్లతో పాటు చాలా మంది వైద్యులు తమ వంతుగా రోగులకు చికిత్సలు అందిస్తున్నారు. వైద్యో నారాయణో హరి: అనే సూక్తిని నిజం చేస్తూ విధులు నిర్వహిస్తున్న డాక్టర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసాడు. డాక్టర్లందరు ఆరోగ్య సంరక్షణ సేవలో అనుక్షణం అప్రమత్తమై మెలగాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా డాక్టర్లు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోని మీతో పాటు మీ ప్రియమైన వారు సురక్షితంగా ఉండటానికి సహాయ పడండి అంటూ కోరారు.మనమంతా పెద్ద కుటుంబం. మీరు చేస్తున్న సేవలు వెల కట్టలేనివి. ఈ కరోనా మహామ్మారి పోరాటంలో మీలో ఎవరికైనా కరోనా లక్షణాలు బయటపడినా.. ఈ వ్యాధి బారిన పడిన వారికి ఆసుపత్రి అన్ని జాగ్రత్తలతో పాటు బాధ్యతలు కూడా తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రాణాంతకమైన కరోనా మహామ్మారిపై మీ పోరాటం, వ్యాధి కట్టడిలో అలుపెరుగని మీ సేవలు మరియు విధుల యందు మీరు చూపిస్తున్న నిబద్ధతకు మీ అందరికీ హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Coronavirus, Covid-19, NBK, Tollywood

  ఉత్తమ కథలు