బ్యాడ్మింటన్ స్టార్ సిక్కిరెడ్డికి కరోనా.. గోపీచంద్ అకాడమీలో కలకలం..

భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎన్.సిక్కిరెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

news18-telugu
Updated: August 13, 2020, 10:47 PM IST
బ్యాడ్మింటన్ స్టార్ సిక్కిరెడ్డికి కరోనా.. గోపీచంద్ అకాడమీలో కలకలం..
పీవీ సింధుతో సిక్కిరెడ్డి
  • Share this:
భారత బ్యాడ్మింటన్ స్టార్ ఎన్.సిక్కిరెడ్డికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె కరోనాకు చికిత్స పొందుతోంది. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో ప్రాక్టీస్ పునఃప్రారంభం చేస్తున్నారు. కరోనా టెస్టులు నిర్వహించగా, ఆమెకు పాజిటివ్ వచ్చినట్టు తేలింది. సిక్కిరెడ్డితో పాటు ఫిజియో థెరపిస్ట్ కిరణ్ జార్జ్ కూడా కరోనా వచ్చింది. ఇద్దరికీ ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. గోపీచంద్ అకాడమీలో పీవీ సింధు, బి. సాయి ప్రణీత్ లాంటి వారు కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇండియన్ నేషనల్ టీమ్ కోచ్ గోపీచంద్‌తో పాటు అకాడమీలో ఇతర క్రీడాకారులు, సిబ్బంది కూడా ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. సిక్కిరెడ్డి, కిరణ్ జార్జ్‌కు కరోనా రావడంతో వెంటనే అకాడమీని క్లోజ్ చేశారు. రెండు రోజుల పాటు శానిటైజ్ చేసిన తర్వాత మళ్లీ తెరవనున్నారు. క్రీడాకారుల ఆరోగ్య భద్రత విషయంలో అన్ని సమగ్రమైన చర్యలు తీసుకుంటున్నట్టు సాయ్ తెలిపింది. వీలైనంత త్వరగా మళ్లీ ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్టు చెప్పింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 13, 2020, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading