కనికా కపూర్‌‌ ఆరోగ్యం విషమం.. నాలుగోసారి కరోనా పాజిటివ్..

Kanika Kapoor: ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. పదిరోజుల కిందే ఇది జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఆమె మళ్లీ పార్టీలకు వెళ్లింది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 29, 2020, 5:08 PM IST
కనికా కపూర్‌‌ ఆరోగ్యం విషమం.. నాలుగోసారి కరోనా పాజిటివ్..
సింగర్ కనికా కపూర్‌కు కరోనా (kanika kapoor corona)
  • Share this:
ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్‌కు కరోనా వైరస్ సోకింది. పదిరోజుల కిందే ఇది జరిగింది. అయితే ఆ తర్వాత కూడా ఆమె మళ్లీ పార్టీలకు వెళ్లింది. దీనిపై కనికా కపూర్‌పై కేసు కూడా ఫైల్ చేసారు పోలీసులు. అయితే ఇదిలా ఉంటే పది రోజులుగా ఈమె ఉత్తరప్రదేశ్‌లోని సంజయ్‌ గాంధీ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో చికిత్స పొందుతుంది. అయినా కూడా ఈమె ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. దాంతో అంతా ఆందోళన పడుతున్నారు. వరసగా నాలుగోసారి కూడా ఈమెకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ అని వచ్చింది.

సింగర్ కనికా కపూర్‌కు కరోనా (kanika kapoor corona)
సింగర్ కనికా కపూర్‌కు కరోనా (kanika kapoor corona)


సాధారణంగా ఒకటి రెండు సార్లు చేసిన తర్వాత మూడోసారి కరోనా నెగిటివ్ అని వస్తుందంటున్నారు వైద్యులు. కానీ కనికా కపూర్ విషయంలో ఇది జరగడం లేదు. ఇప్పటికీ నాలుగుసార్లు పరీక్ష చేస్తే అన్నిసార్లు పాజిటివ్ అని రావడంతో ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నారు కుటుంబ సభ్యులు. కనీసం మెరుగైన వైద్యం కోసం వేరే దేశానికి తీసుకెళ్దామన్నా కూడా ఫ్లైట్స్ లేవిప్పుడు. అయినా కూడా అమెరికా, ఇటలీ లాంటి దేశాలే కరోనా బారిన పడి విలవిలలాడుతున్నాయి. ఇలాంటి సమయంలో కనికాను ఎక్కడికి తీసుకెళ్లలేని పరిస్థితి.

సింగర్ కనికా కపూర్‌కు కరోనా (kanika kapoor corona)
సింగర్ కనికా కపూర్‌కు కరోనా (kanika kapoor corona)


ఈమె దీంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కనికా త్వరగా కోలువాలని భగవంతున్ని ప్రార్థించడం తప్ప ఇంకేం చేయలేకపోతున్నామని తెలిపారు వాళ్లు. మరోవైపు ఈమె శరీరం వైద్యానికి స్పందించడం లేదంటూ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మార్చి 9న లండన్‌ నుంచి వచ్చిన కనికా కపూర్‌ ఉత్తర ప్రదేశ్‌లోని హోటల్‌లో బస చేసింది.

సింగర్ కనికా కపూర్‌కు కరోనా (kanika kapoor corona)
డిన్నర్ పార్టీలో కనికా కపూర్, వసుంధరా రాజే, దుశ్యంత్


ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. ఆమెకు కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది.. దాంతో పాటు ఆమెను కలిసిన వాళ్లను కూడా సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి పంపించారు. మరోవైపు కరోనాపై ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు పాటించకుండా.. కరోనా వచ్చిన తర్వాత కూడా పార్టీకి వచ్చినందుకు కనికాపై పోలీసులు కేసు నమోదు కూడా చేశారు.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading