రాందేవ్ బాబా సంచలనం...పతంజలి నుంచి కరోనా ఔషధం...క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధం...

పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ మేము ఇక్కడ రోగనిరోధక శక్తిని పెంచే వాటి గురించి మాట్లాడటం లేదు. కరోనా చికిత్స కోసం ఔషధం కనుగొనే పనిలో ఉన్నట్లు తెలిపారు. గత వారం రెగ్యులేటరీ అనుమతి పొందిన తరువాత, ఇండోర్, జైపూర్ లోని కంపెనీ యూనిట్లలో క్లినికల్ ట్రయల్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

news18-telugu
Updated: May 28, 2020, 10:27 PM IST
రాందేవ్ బాబా సంచలనం...పతంజలి నుంచి కరోనా ఔషధం...క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధం...
PTI Photo
  • Share this:
కరోనా వైరస్ కు ఔషధం కనుగొనడానికి బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలోని పతంజలి సంస్థ కూడా రంగంలోకి దిగింది. దీనికి సంబంధించిన డ్రగ్ ట్రయల్ ప్రారంభించినట్లు సంస్థ ప్రతినిధి బాలక్రిష్ణ తెలిపారు. అవసరమైన రెగ్యులేటరీ ఆమోదాలు పొందిన తరువాత COVID-19 చికిత్స కోసం మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామని పతంజలి గ్రూప్ తెలిపింది. పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణ మాట్లాడుతూ మేము ఇక్కడ రోగనిరోధక శక్తిని పెంచే వాటి గురించి మాట్లాడటం లేదు. కరోనా చికిత్స కోసం ఔషధం కనుగొనే పనిలో ఉన్నట్లు తెలిపారు. గత వారం రెగ్యులేటరీ అనుమతి పొందిన తరువాత, ఇండోర్, జైపూర్ లోని కంపెనీ యూనిట్లలో క్లినికల్ ట్రయల్ ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.

కరోనా చికిత్స వ్యాక్సిన్ అలాగే ఔషధం కోసం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా కంపెనీలు , ప్రయోగాలు చేస్తున్నాయి. గిలియడ్ సైన్సెస్, ఫైజర్, జాన్సన్ & జాన్సన్, మోడెర్నా, ఇన్నోవియో ఫార్మా, గ్లాక్సో స్మిత్‌క్లైన్ వంటి పేర్లు ఉన్నాయి. ఈ పెద్ద కంపెనీల జాబితాలో పతంజలి పేరు చేరడం సంస్థకి పెద్ద విజయమే అని నిర్వహకులు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే యోగా గురువు, వ్యవస్థాపకుడు బాబా రామ్‌దేవ్ స్థాపించిన పతంజలి భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది. 2019 ఆర్థిక సంవత్సరంలో పతంజలి ఆయుర్వేదానికి 8,500 కోట్ల రూపాయల టర్నోవర్ ఉండగా, కంపెనీలో 50000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పతంజలి భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎఫ్‌ఎంసిజి సంస్థ అని బ్రోకరేజ్ హౌస్‌లు సిఎల్‌ఎస్‌ఎ, హెచ్‌ఎస్‌బిసి అభిప్రాయపడ్డాయి. అయినప్పటికీ, విస్తరణ ప్రణాళికలలో నిర్లక్ష్యం, ఉత్పత్తుల నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదుల కారణంగా, సంస్థకు ఎదురుదెబ్బ తగిలింది. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారికి చికిత్స చేయడానికి క్లినికల్ ట్రయల్ ప్రారంభించడం సంస్థ అతి ఉత్సాహపూరితమైన చర్యగా నిపుణులు పేర్కొంటున్నారు.

కోవిడ్ -19 రోగుల కోసం ఫిబ్రవరి నుంచే పతంజలి గ్రూపులో చికిత్స ప్రారంభించినట్లు ఆచార్య బాలకృష్ణ చెప్పారు. మార్చి వరకు, పతంజలి వేలాది కరోనా రోగులకు చికిత్స చేసిందని, కాని ఈ రోగులు ఎటువంటి క్లినికల్ ట్రయల్స్ లో భాగం కాలేదని స్పష్టం చేశారు. మా శోధనను చికిత్సగా నమోదు చేసుకోవటానికి, మేము క్లినికల్ ట్రయల్ ద్వారా వెళ్ళాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని, క్లినికల్ ట్రయల్స్‌పై రెగ్యులేటరీ ఆమోదంతో కంపెనీ ట్రయల్‌ను ప్రారంభిస్తుందని పేర్కొన్నారు.
First published: May 28, 2020, 10:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading