Coronavirus: కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వస్తుందా? మీరేం చేయాలంటే

Coronavirus pandemic | కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వస్తుందా? ఈ అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. మరి మీరేం చేయాలో తెలుసుకోండి.

news18-telugu
Updated: March 20, 2020, 2:38 PM IST
Coronavirus: కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వస్తుందా? మీరేం చేయాలంటే
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్... భారతదేశాన్నే కాదు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఎవరికి ఎవరిద్వారా ఎప్పుడు వస్తుందో అంతుచిక్కట్లేదు. ఈ వైరస్ బారిన పడకూడదంటే జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండటమే మేలు. అందుకే జనం గుమికూడొద్దని, రద్దీ ప్రాంతాల్లో తిరగొద్దని, అసలు ఇంట్లోంచి బయటకు రాకపోవడమే మంచిదని చెబుతున్నారు డాక్టర్లు. ఇంకో షాకింగ్ విషయమేంటంటే మీరు ఉపయోగించే ఏటీఎం కార్డులు, క్రెడిట్ కార్డులు, కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వచ్చే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. అందుకే క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించి డిజిటల్ పేమెంట్స్‌ని ఆశ్రయించడమే మంచిది. వాల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ఉపయోగించడం మేలని సూచించింది.

ఇలాంటి పరిస్థితుల్లో మీరు కరెన్సీని వీలైనంత తక్కువగా వాడటం మంచిది. యూపీఐ, ఐఎంపీఎస్, ఆర్‌టీజీఎస్, మొబైల్ వ్యాలెట్స్, నెట్ బ్యాంకింగ్ లాంటి సేవల్ని ఉపయోగించుకొని మీరు మీ లావాదేవీలు జరపొచ్చు. ఎక్కడైనా డబ్బులు చెల్లించాలంటే పేటీఎం, గూగుల్ పే లాంటి పేమెంట్ ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. అంతేకాదు... ఎవరికైనా డబ్బులు పంపాలన్నా క్యాష్ తీసుకెళ్లి ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా బ్యాంకులోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. కరెన్సీ నోట్లతో కరోనా వైరస్ వ్యాపిస్తుందా లేదా అన్న సంగతి పక్కన పెడితే... డిజిటల్ పద్ధతుల్లో లావాదేవీలు జరపడం వల్ల మనుషులు కలవాల్సిన అవసరం ఉండదు. ఎలాగో సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెబుతున్నారు కాబట్టి డిజిటల్ లావాదేవీలు జరపడమే మంచిది.

ఇవి కూడా చదవండి:

EPFO: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పెద్ద షాక్... దెబ్బకొట్టిన కరోనా

Coronavirus Effect: మీ డబ్బుల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Coronavirus: ఐఆర్‌సీటీసీకి భారతీయ రైల్వే ముఖ్య గమనిక
Published by: Santhosh Kumar S
First published: March 20, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading