#Tokyo2020 : కరోనా ఎఫెక్ట్... టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా?

Coronavirus | Covid 19 : టోక్యో ఒలింపిక్స్‌ను అద్భుతంగా నిర్వహించాలనుకున్న జపాన్‌కి కరోనా వైరస్ తీవ్ర నిరాశ కలిగిస్తోంది.

news18-telugu
Updated: March 23, 2020, 8:59 AM IST
#Tokyo2020 : కరోనా ఎఫెక్ట్... టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా?
#Tokyo2020 : కరోనా ఎఫెక్ట్... టోక్యో ఒలింపిక్స్ 2021కి వాయిదా? (credit - twitter - china daily)
  • Share this:
Coronavirus | Covid 19 : ఎలాంటి ప్రకటనైతే రాకూడదని అథ్లెట్లూ, క్రీడాకారులూ కోరుకున్నారో అది ఆస్ట్రేలియా నుంచి అధికారికంగా వచ్చింది. ఈ ఏడాది జపాన్‌లో జరగాల్సిన ఒలింపిక్స్‌... షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు లేవనీ, తమ అథ్లెట్లు 2021లో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రిపేర్ అవుతారని ఆస్ట్రేలియా ఒలింపిక్స్ అధికారులు ప్రకటించారు. దీనిపై టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు ఇంకా స్పందించలేదు. కానీ... వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొన్నటిదాకా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని మాటిమాటికీ చెప్పిన నిర్వాహకులు... వారం నుంచీ సైలెంట్ అయిపోయారు. వాయిదా వేసి... వచ్చే ఏడాది జరపాలా లేక వేరే దేశంలో జరపాలా అన్న అంశంపై ఆలోచనల్లో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రీడల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జపాన్ ప్రభుత్వం మాత్రం వీటిని షెడ్యూల్ ప్రకారమే జరపాలని డిమాండ్ చేస్తోంది.

షెడ్యూల్ ప్రకారమైతే టోక్యో ఒలింపిక్స్‌ జూలై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ జపాన్‌తో పాటూ 192 దేశాల్లో విస్తరించింది. ఎక్కడికక్కడ లాక్ డౌన్లు ఉన్నాయి. విమాన సర్వీసులు సరిగా లేవు. అందుకే ఈ క్రీడలు ప్రస్తుత షెడ్యూల్‌లో నిర్వహించడం కుదరదని భావిస్తున్నారు. ఇప్పటికే చాలా క్రీడలు రద్దైనందున ఒలింపిక్స్ కూడా అదే రూట్‌లో వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలు ఇప్పటికే రద్దయ్యాయి. అథ్లెట్ల ట్రైనింగ్ కూడా సాగట్లేదు. చాలా దేశాలు వాయిదా వెయ్యమని కోరుతున్నాయి.

ఒలింపిక్స్‌ రద్దయితే..రూ. 21,500 కోట్ల స్వదేశీ స్పాన్సర్‌షిప్‌, ఏర్పాట్లపై ఖర్చుపెట్టిన రూ. 90 వేల కోట్లు నష్టపోతామని జపాన్‌ ప్రధాని షింజో అబే అంటున్నారు. ఐతే... ఒలింపిక్స్ అధికారులు వాయిదాకి సంబంధించి మూడు ప్లాన్లను సిద్ధం చేసినట్లు తెలిసింది. క్రీడల్ని రెండు నెలలు వాయిదా వేస్తారని తెలుస్తున్న తరుణంలో... ఆస్ట్రేలియా అధికారులు చేసిన ప్రకటనతో... ఒలింపిక్స్‌ని 2021కి వాయిదా వేస్తారా అన్న డౌట్స్ వస్తున్నాయి.

First published: March 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు