COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌లో అపశృతి.. టీకా తీసుకున్న వాలంటీర్ మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తీసుకురావడానికి వేగంగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అస్ట్రాజెనె‌కా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఓ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి.

news18-telugu
Updated: October 22, 2020, 7:42 AM IST
COVID Vaccine: కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్‌లో అపశృతి.. టీకా తీసుకున్న వాలంటీర్ మృతి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ తీసుకురావడానికి వేగంగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా అస్ట్రాజెనె‌కా-ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఓ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ప్రపంచంలోని పలుచోట్ల ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. తొలిదశ క్లినికల్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈ వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ ఒకరు మృతిచెందాడు. వ్యాక్సిన్ మొదటి, రెండో దశ పరీక్షల సందర్భగా అనారోగ్యానికి గురై అతను మరణించినట్టుగా తెలుస్తోంది.

ఈ విషయాన్ని బ్రెజిల్ హెల్త్ అథారిటీ అన్విసా బుధవారం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన డేటా అందిందని.. దర్యాప్తు చేపట్టామని చెప్పింది. అయితే వాలంటీర్ మృతిచెందిన తర్వాత కూడా వ్యాక్సిన్ పరీక్షలు కొనసాగనున్నాయని తెలిపింది. అయితే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్నవారి వివరాలు హెల్త్ డిటేల్స్ గోప్యత దృష్ట్యా మరిన్ని విషయాలను వెల్లడించలేదు. బ్రెజిల్‌లో ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌ను పర్యవేక్షిస్తున్న ఫెడరల్ యూనివర్సిటీ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిచింది. ట్రయల్స్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి బ్రెజిల్‌కు చెందిన వ్యక్తి అని తెలిపింది. అయితే అతడు ఎక్కడ నివసించేవాడనే వివరాలు వెల్లడించలేదు. అయితే చనిపోయిన వాలంటీర్.. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల మరణించాడా?, లేక మరేదైనా అనారోగ్య కారణలతో మృతిచెందాడా? అనేదానిపై స్ఫష్టత రావాల్సి ఉంది.

యూకే వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి రియో డీ జెనరీలోని బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ ఫియోక్రజ్‌లో ఉత్పత్తి చేయడానికి బ్రెజిల్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు చైనాకు చెందిన సినోవాక్ వ్యాక్సిన్‌ను సావో పాలోలోని రీసెర్చ్ సెంటర్ బుటాంటన్ ఇనిస్టిట్యూట్‌లో పరీక్షిస్తోంది. ఇక, బ్రెజిల్‌లో కరోనా మరణాల రేటు చాలా ఎక్కువగా ఉంది. 1,54,000 మంది కరోనాతో మృతిచెందారు. అలాగే కరోనా వైరస్ కేసుల విషయంలో ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. ఇక్కడ ఇప్పటికే 5.2 మిలయన్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
Published by: Sumanth Kanukula
First published: October 22, 2020, 7:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading