ASSAM GOVERNMENT DECIDED TO PROHIBIT PEOPLE FROM PUBLIC PLACE THOSE WHO NOT TOOK CORONA VACCINE AK
Covid 19: కరోనా టీకా తీసుకోకుంటే అంతే.. ఆ రాష్ట్రం కీలక నిర్ణయం.. దేశంలోనే తొలిసారి..
ప్రతీకాత్మక చిత్రం
Corona Vaccine: ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రమైన అసోం మరో అడుగు ముందుకు వేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని కేంద్రం, రాష్ట్రాలు నిర్ణయించాయి. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా ముప్పు తక్కువగా ఉందని.. వీరికి కరోనా సోకినప్పటికీ ప్రాణాపాయం ఉండదనే విషయం పలు అధ్యయనాల్లో వెల్లడవుతోంది. ఇప్పటికే పలు చోట్ల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికే అనుమతి ఇస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఈ విషయంలో ఈశాన్య రాష్ట్రమైన అసోం మరో అడుగు ముందుకు వేసింది. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కరోనా వ్యాక్సిన్ రెండో డోసులు తీసుకోని వారిని బహిరంగ ప్రదేశాల్లో అనుమతించవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అసోంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా నివారణతో పాటు ప్రజలందరూ కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అక్కడి ప్రభుత్వం భావించింది. అందుకే కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారిని నేటి నుంచి జిల్లా కోర్టులు, హోటళ్లు, మార్కెట్లు మొదలైన బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించబోమని అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ తెలిపారు.
అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనితో పాటు, రాష్ట్రంలో లాక్డౌన్ విధించడంపై కూడా అసోం ముఖ్యమంత్రి స్పందించారు. రాష్ట్రంలో ఇంకా అలాంటి పరిస్థితి లేదని, అయితే మాస్క్ ధరించడం తప్పనిసరి అని హేమంత్ బిస్వా శర్మ సూచించారు. భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాలు కరోనా వైరస్ బారిన పడ్డాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 32 కోట్ల 59 లక్షల మందికి పైగా కరోనా బారిన పడ్డారు.
మన దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో కరోనా సోకిన వారి సంఖ్య మూడు కోట్ల 75 లక్షలు దాటింది. మరోవైపు భారత్లో కరోనాకు వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ ప్రచారం జరుగుతోంది. కరోనా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోని వారికి ఆ రకంగా వ్యాక్సిన్ ఇవ్వడంతో పాటు 18 ఏళ్ల లోపు యువతకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు ఇవ్వాలని కేంద్రం కొద్దిరోజుల క్రితమే నిర్ణయం తీసుకుంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.