యూఎస్‌లో కరోనా వాక్సిన్ ట్రయల్స్.. లక్షల్లో టీకాల తయారీకి ఏర్పాట్లు

వాక్సిన్ ట్రయల్స్ దశలోనే ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో టీకాలను తయారు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీని కోసం వేలాది మంది సిబ్బందితో పాటు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ హోగ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు.

news18-telugu
Updated: March 23, 2020, 10:44 PM IST
యూఎస్‌లో కరోనా వాక్సిన్ ట్రయల్స్.. లక్షల్లో టీకాల తయారీకి ఏర్పాట్లు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా మహమ్మారి యావంత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోవిడ్-19 బారిన పడి యూరప్‌లో ప్రజలు పిట్టల్లా రాలుతున్నాయి. ఈ వ్యాధికి ఎప్పుడు మందు కనిపెడతారా.. అని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్నారు. ఐతే ఇప్పటికే పలు దేశాలు, సంస్థలు ఆ ప్రయత్నాల్లో ఉన్నాయి. అందులో అమెరికాకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH), మసాచుసెట్స్‌కు చెందిన బయోటెక్నాలజీ కంపెనీ మోడర్నా థెరపెటిక్స్ మానుఫ్యాక్చరింగ్ సంస్థ ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పటికే ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఎంఆర్ఎన్ఏ-1273 అనే ప్రయోగాత్మక వ్యాక్సీన్‌ను రూపొందించాయి. అంతేకాదు జెన్నీఫర్ హాలర్ అనే 43 ఏళ్ల మహిళపై ట్రయల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమెకు తొలి ఇంజెక్షన్ ఇచ్చారు.

వాక్సీన్ పూర్తిస్థాయిలో అందుబాటులో వచ్చేందుకు ఏడాది కాలం పడుతుందని అంచనాలున్నప్పటికీ.. మోడర్నా థెరపెటిక్స్ మానుఫ్యాక్చరింగ్ సంస్థ మరింత దూకుడుగా ముందుకెళ్తోంది. వాక్సిన్ ట్రయల్స్ దశలోనే ఉన్నప్పటికీ పెద్ద మొత్తంలో టీకాలను తయారు చేసేందుకు సన్నద్ధమవుతోంది. దీని కోసం వేలాది మంది సిబ్బందితో పాటు సంస్థ అధ్యక్షుడు డాక్టర్ స్టీఫెన్ హోగ్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. తొలి దశ పరీక్షల్లో ఈ వాక్సిన్ సురక్షితమేనని తేలితే.. వెంటనే ఉత్పత్రి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

తొలి దశ కింద మొత్తం 45 మంది వాలంటీర్లపై క్లినికల్ ట్రయల్స్ చేస్తారు. ఇప్పటి వరకు COVID-19కు కారణమయ్యే SARS-CoV-2 వైరస్ బారినపడని వారికి మాత్రమే ఎంఆర్ఎన్ఏ-1273 వ్యాక్సిన్ షాట్స్ ఇస్తారు. ముందుగా అది సురక్షితా..? కదా..? అని పరీక్షిస్తారు. ఆ తర్వాత మూడు వేర్వేరు స్థాయుల్లో డోసేజ్ పెంచి టీకా ఇస్తారు. అలా డోసేజ్ ఇస్తూ ఎప్పుడు బలమైన వ్యాధి నిరోధక శక్తి వస్తుందో చెక్ చేస్తారు. అలా వాలంటర్లీలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకపోతే.. మరిన్ని పరీక్షల కోసం వందలాది మంది వాలంటీర్లను నియమించుకోవాలని భావిస్తోంది. ఐతే ఆ ప్రయత్నాల్లో ఉంటూనే.. మరోవైపు ఏ క్షణంలోనైనా వాక్సిన్ ప్రొడక్షన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.First published: March 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading