హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Omicron : ఒమిక్రాన్ దెబ్బకు వ్యాక్సినేషన్‌లో భారీ మార్పు! -మోదీ సర్కార్ ఏం చేయబోతోందటే..

Omicron : ఒమిక్రాన్ దెబ్బకు వ్యాక్సినేషన్‌లో భారీ మార్పు! -మోదీ సర్కార్ ఏం చేయబోతోందటే..

ఇక, ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక, ఒమిక్రాన్ వేరియంట్ వలన ప్రాణాపాయం చాలా తక్కువని, ఒమిక్రాన్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా కేసులు భారీగా వస్తున్నాయి. ఈ నెల ఆఖరు.. ఫిబ్రవరిలో భారీగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.

డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే పరిస్థితి మళ్లీ తలకిందులు కావడం ఖాయమన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారీ మార్పులు చేసేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఒకటి రెండు వారాల్లోనే కేంద్రం.. బూస్టర్ డోసు పాలసీని ప్రకటించనుంది..

ఇంకా చదవండి ...

Omicron.. సరిగ్గా ఏడు అక్షరాలున్న ఈ పదం.. సప్తసముద్రాల మధ్యన ఉన్న ప్రపంచ మానవాళిని గడగడలాడిస్తున్నది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిలో కరోనా వైరస్ మ్యూటేషన్ చెందిన సౌతాఫ్రికాలో పుట్టిన ఈ కొత్త వేరియంట్ ఇప్పటిదాకా ఒక్కరినీ కూడా బలితీసుకోకున్నా.. రాబోయే రోజుల్లో మరింతగా వ్యాప్తి చెందితే.. సెకండ్ వేవ్ నాటి డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ ప్రాణాలను తీస్తుందని సైంటిస్టులు అంచానా వేస్తున్నారు. ఒమిక్రాన్ ప్రమాదకారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్.. ఇప్పటికే డెల్టా దెబ్బకు డీలా పడిపోయిన నేపథ్యంలో ఒమిక్రాన్ గనుక ఇక్కడ విజృంభిస్తే తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకే దాన్ని ఆదిలోనే నివారించే దిశగా కేంద్రంలోని మోదీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రస్తుతం అమలవుతోన్న కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.

డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగితే ప్రపంచం పరిస్థితి మళ్లీ తలకిందులు కావడం ఖాయమని ఇప్పటికే హెచ్చరికలు, రిపోర్టులు వెలువడ్డాయి. డజనుకుపైగా దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు విధించగా, భారత్ సైతం కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నది. అయితే ఒమిక్రాన్ దెబ్బ నుంచి కాచుకోడానికి బూస్టర్ డోసు ఒక్కటే శరణ్యమనే భావన ఇటీవల బలపడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మూడో డోస్‌కు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే అనేక దేశాలు తమ పౌరులకు బూస్టర్‌ డోస్‌ వేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత సర్కారు కూడా మూడో డోసు పంపిణీపై పాలసీ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నది..

రోజూ మధ్యాహ్నం కోడలిని అలా చూస్తూ తట్టుకోలేక అత్తమామల అకృత్యం -అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారుకొవిడ్ వ్యాక్సిన్లకు సంబంధించి భారత్ లో ప్రస్తుతం రెండు డోసుల విధానమే అమలులో ఉంది. బూస్టర్ డోసుగా భావించే మూడో డోసుపై ఇంకా విధానపరమైన నిర్ణయం వెలువడలేదు. అయితే, ఒమిక్రాన్ వేరియంట్ సుడిగాలిలా ప్రపంచమంతటా వ్యాపిస్తోన్న నేపథ్యంలో మూడో డోసు పంపిణీపై భారత్ సర్కారు కసరత్తును ముమ్మరం చేసింది. డిసెంబర్ రెండో వారంలోపే దేశంలో బూస్టర్ డోసు పంపిణీపై కేంద్రం ఒక విధానాన్ని ప్రకటించబోతున్నదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

800 year old mummy : సంచలన చరిత్రను వెలికితీశారు -పెరూలో తక్కువ వయసున్న మమ్మీ -ఈజిప్ట్ వెలుపల తొలిసారి


ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో మూడో డోసు పంపిణీని మొదలు పెడితే, ముందుగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లకు ఇవ్వాలా? లేక ఆరోగ్యవంతులకే అందజేయాలా? రెండో డోసు తీసుకున్న ఎన్ని రోజుల వ్యవధిలో బూస్టర్ డోసుగా మూడో టీకాను ఇవ్వాలి? తదితర అంశాలపై పూర్తి స్థాయి క్లారిటీతో కేంద్రం వ్యాక్సినేషన్లపై కొత్త విధానాన్ని డిసెంబర్ రెండో వారంలోపే ప్రకటించనుంది.

weight loss drinks : గ్రీన్ టీ, ఇతర డ్రింక్స్‌తో నిజంగానే బరువు తగ్గొచ్చా? -వాస్తవమేంటో తెలుసుకోండినిజానికి మన దేశంలో ఇవాళ్టికి 123 కోట్ల డోసులు పంపిణీ అయినప్పటికీ, రెండో డోసు తీసుకోడానికి చాలా మంది నిరాకరిస్తున్నారు. దీంతో వ్యాక్సిన్ నిల్వలు పేరుకుపోతున్నాయి. సోమవారం నాటికి 25 కోట్ల డోసుల స్టాక్ ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. వ్యాక్సిన్లు వృధా కాకుండా బూస్టర్ డోసులుగా వాటిని అందిస్తే మంచిదని నిపుణులు ముందునుంచే చెబుతున్నారు. సుమారు 75 దేశాల్లో బూస్టర్ డోసు విదానం అమలవుతున్నది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనూ కేంద్రం ఒమిక్రాన్ పై చర్చ చేపట్టనుంది. బుధవారమే ఒమిక్రాన్ పై ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశాలున్నాయి.

Published by:Madhu Kota
First published:

Tags: Covid, India, Omicron corona variant, Vaccination

ఉత్తమ కథలు