హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

Covid Vaccine Mixing: కరోనా వ్యాక్సిన్ల మిక్సింగ్‌ తప్పు.. సీరం చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ఎందుకు వద్దంటే..

Covid Vaccine Mixing: కరోనా వ్యాక్సిన్ల మిక్సింగ్‌ తప్పు.. సీరం చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ఎందుకు వద్దంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Covaxin and Covishield Vaccine Mixing: కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్ల మిక్సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన వేళ సీరం ఇన్ స్టిట్యూట్ అధినేత సైరస్ పూనావాలా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కరోనా వ్యాక్సిన్ల మిక్సింగ్‌కు సంబంధించి సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధినేత సైరస్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19 వ్యాక్సిన్లను మిక్ చేయడం తప్పు అని ఆయన కుండబద్దలు కొట్టారు. దీని వల్ల సమస్యలు వస్తాయని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లను మిక్స్ చేయడానికి సంబంధించి ఏదైనా తేడా జరిగితే అప్పుడు కంపెనీలు ఒకరి మీద మరొకరు బురద జల్లే ప్రమాదం తలెత్తుతుందని సీరం చీఫ్ సైరస్ పూనావాలా హెచ్చరించారు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను మిక్స్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సంస్థ డీసీజీఐ అనుమతి ఇచ్చిన వేళ సీరం ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తున్న సంస్ధగా సీరం సంస్థకు పేరుంది. పూణే కేంద్రంగా పని చేస్తున్న సీరం ఇన్ స్టిట్యూట్ తొలిసారిగా కోవిషీల్డ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌ కూడా కరోనా నియంత్రణలో ఉపయోగిస్తున్నారు.

ఈ కోవాగ్జిన్, కోవిషీల్డ్‌ను మిక్స్ చేయాలంటూ గత కొన్ని రోజులుగా ప్రతిపాదనలు వస్తున్నాయి. దాని వల్ల ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. తాజాగా కేంద్రం కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడులోని వెల్లూర్‌లో ఉన్న క్రిస్టీ మెడికల్ కాలేజీలో దీనికి సంబంధించిన పరిశోధనలు జరుగుతున్నాయి. సుమారు 300 మంది వైద్య నిపుణులు ఇందులో పాల్గొంటున్నారు. అయితే, వ్యాక్సిన్ల మిక్సింగ్ వల్ల సమస్యలు వస్తాయని ఇప్పుడు సీరం చీఫ్ సైరస్ పూనావాలా కామెంట్స్ చేశారు.

వ్యాక్సిన్లను మిక్స్ చేయాల్సిన అవసరం లేదని సైరస్ పూనావాలా చెప్పినట్టు ఎకనామిక్ టైమ్స్ వార్తను ప్రచురించింది. ఏదైనా తేడా జరిగితే రెండు వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థల మధ్య నిందారోపణలు చేసుకునే ప్రమాదం తలెత్తుతుందని ఆయన వ్యాఖ్యానించారు.  ‘ఏదైనా తేడా వస్తే అప్పుడు మా తప్పేం లేదు. ఆ మరో కంపెనీదే తప్పు అని సీరం చెబుతుంది. అదే సమయంలో ఆ మరో కంపెనీ కూడా తమ తప్పేం లేదని వాదిస్తుంది. నా ఉద్దేశంలో ఇలా వ్యాక్సిన్లను మిక్స్ చేయడం చాలా తప్పు. కావాలంటే నా మాటగా మీరు రాసుకోవచ్చు.’ అని సైరస్ పూనావాలా కుండబద్దలు కొట్టారు. పూణెలో జరిగిన తిలక్ విద్యాపీఠ్ మహోత్సవ్‌లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. అదే సమయంలో రెండు వ్యాక్సిన్లను మిక్స్ చేసినప్పుడు జరిగిన ట్రయల్స్ కూడా పెద్దగా ఫలితాలను ఇవ్వలేదనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు.

First published:

Tags: Coronavirus, Covaxin, Covid -19 pandemic, Covishield

ఉత్తమ కథలు