వేరుసెనగ పంపిణీ కేంద్రాల వద్ద సామాజిక దూరం పాటించని రైతులు...

రాయితీ వేరుసెనగ పంపిణీలో అన్నదాతలకు అగచాట్లు తప్పలేదు

ఉదయం ఏడు గంటల నుంచి రైతన్నలు పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు.

  • Share this:
    వీ. కోట మండలం గోనుమాకుల పల్లి పంచాయతీ లో రాయితీ వేరుసెనగ పంపిణీలో అన్నదాతలకు అగచాట్లు తప్పలేదు.సర్వర్ మొరాయించడంతో పంపిణీ ముందుకు సాగలేదు. ఉదయం ఏడు గంటల నుంచి రైతన్నలు పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇప్పటి వరకు పది మందికి రసీదులిచ్చారు. అనంతరం సర్వర్ మొరాయించడంతో ఒక్కో రైతుకు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు సమయం తీసుకుంటుంది. ఆ తరువాత మళ్లీ మొరాయిస్తుంది. దీంతో రైతులు పడిగాపులు పడుతున్నారు. కనీసం సామాజిక దూరం పాటించడం లేదు. గుంపులుగా పోగబడ్డారు. సర్వర్ సామర్థ్యాన్ని పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుని ఉంటే రైతులకు ఈ పరిస్థితులే ఏర్పడేది కాదని వారు వాపోతున్నారు. వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం రైతులకు ఈ దుస్థితి ఏర్పడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు కట్టించుకుని రసీదు ఇచ్చిన అనంతరం వేరుసెనగ కాయలు ఎక్కడ పంపిణీ చేస్తారో తెలియక కొంతమంది రైతులు వెనుతిరిగారు. మీరు సేనలు నిల్వ కేంద్రాల వద్ద తగిన సిబ్బందిని నియమించక వ్యవసాయ శాఖాధికారి అలక్ష్యంగా వ్యవహరించారు. దీంతో రైతులు ఇబ్బందులు పడాల్సిన ప్రస్తుత ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు సర్వే సామర్థ్యాన్ని పెంచి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.
    Published by:Venu Gopal
    First published: