Protect From Corona: వావ్.. కరోనాను ఇలా కట్టడి చేయండి.. వీడియో వైరల్

ప్రపంచాన్ని గజగజా వణికిస్తున్న కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికైతే దానికి వ్యాక్సిన్ లేదు. ముందు జాగ్రత్త చర్యలే శ్రీరామరక్ష అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే సమయంలో కరోనా రాకుండా ఉండటానికి పలువురు కొత్త తరహా ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నారు.

news18
Updated: October 7, 2020, 7:55 PM IST
Protect From Corona: వావ్.. కరోనాను ఇలా కట్టడి చేయండి.. వీడియో వైరల్
photo (twitter)
  • News18
  • Last Updated: October 7, 2020, 7:55 PM IST
  • Share this:
దాదాపు పదినెలలుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పటికే దీని బారిన పడి సుమారు 4 కోట్ల మంది పాజిటివ్ గా తేలగా.. మరణాలు 10 లక్షలు దాటాయి. రికవరీ రేట్ పెరుగుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ దీని ఉధృతి తగ్గడం లేదు. అయితే ఇప్పటివరకూ కరోనా వ్యాక్సిన్ రాకున్నా.. మాస్కులు, మనిషికి మనిషికి దూరంగా ఉండటం, జన సమూహాలకు దూరం పాటించడం, ఏదైనా లక్షణాలు కనిపిస్తే ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ అది రాకుండా కాపాడుకోవడమే.

అయితే ముఖానికి మాస్కులు ధరించినా అవి చాలామందికి సౌకర్యంగా లేవు. ఇక మాస్కులు కూడా తరుచూ ధరిస్తే అంత భద్రం కాదని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా మంది ముఖాలకు మాస్కులు పెట్టుకోకుండానే బయటకు వస్తున్నారు. ముఖానికి గాలి ఆడటం లేదని కొందరు.. పదే పదే ధరించడం వల్ల శ్వాస సమస్యలు వస్తున్నాయని కొందరు.. తప్పనిసరిగా పెట్టుకునే వాళ్లు కొందరు.. ఇలా ఎవరి సమస్యలు వారికున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా పీడ విరగడయ్యేదెప్పుడా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే.. వ్యాక్సిన్ రాకున్నా.. ముఖానికి మాస్కులు ధరించకుండా ఈ వైరస్ నుంచి బారి నుంచి కాపాడుకోవడానికి.. అర్జెంటీనాకు చెందిన ఒక వ్యక్తి కొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చాడు. ముఖం మొత్తం కవరయ్యే విధంగా ఒక ట్యూబ్ ను తయారుచేశాడు. ముఖం పై నుంచి దీనిని వేసుకోవచ్చు. దాదాపు మన చాతి వరకు ఇది వస్తుంది. దీనికి ‘బ్రీత్ వెల్ ట్యూబ్’ అని పేరు పెట్టాడు పాబ్లో బొడ్గాన్. అర్జెంటీనా వాసుడైన బొడ్గాన్.. అక్కడ లాయర్ గా పనిచేస్తున్నారు. ఆయన న్యాయవాదే గాక.. ఇలాంటి ఆవిష్కరణలు చేయడంలో దిట్ట. కొత్త తరహా ఆలోచనలను ఆయన ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారు. ఈ క్రమంలోనే రెండు బ్రీత్ వెల్ ట్యూబ్ లు తయారుచేశాడు. తనకొకటి, తన భార్యకొకటి వేసుకుని అర్జెంటీనా వీధుల వెంట చక్కర్లు కొడుతున్నారు.

ఈ ట్యూబ్ ద్వారా ఏ ఇబ్బంది లేకుండా శ్వాస తీసుకోవచ్చు. ముఖం, వెంట్రుకలు, ఛాతి వరకు ఇది మొత్తం కవర్ చేస్తుంది. ఈ ట్యూబ్ ను ధరించి బయటకు వచ్చిన పాబ్లో ను చూసి అందరూ ముచ్చట పడుతున్నారు. ఈ ట్యూబ్ ద్వారా మాస్కుల బెడద తప్పిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలయింది. వీధుల మీద వెళ్తున్న పాబ్లో దంపతులతో ఫోటోలు దిగడానికి బాటసారులు ఆసక్తి చూపుతున్నారు.

ఈ వీడియోను భారత్ లో ప్రముఖ బిజినెస్ మెన్ గా పేరున్న హర్ష్ గోయెంకా ట్విట్టర్ లో షేర్ చేశారు. మాస్కు కంటే ఎంతో సౌకర్యమైనది అని రాస్తూ.. ఇందుకు సంబంధించిన వీడియోను ఆయన షేర్ చేశారు. ట్విట్టర్ తో పాటు ఇన్ స్టాగ్రాం, ఫేస్ బుక్ లలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
Published by: Srinivas Munigala
First published: October 7, 2020, 4:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading