• HOME
 • »
 • NEWS
 • »
 • CORONAVIRUS-LATEST-NEWS
 • »
 • ARE YOU IRRITATING WITH MASK IN THIS CORONA PANDEMIC TIME HERE IS THE FULL DETAILS OF NEED OF WEARING DOUBLE MASKS HSN

Double Masks: డబుల్ మాస్క్.. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పుడిదే హాట్ టాపిక్.. ఒక మాస్కుపై మరో మాస్క్ పెట్టుకుంటే ప్రయోజనం ఉందా అంటే..!

Double Masks: డబుల్ మాస్క్.. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇప్పుడిదే హాట్ టాపిక్.. ఒక మాస్కుపై మరో మాస్క్ పెట్టుకుంటే ప్రయోజనం ఉందా అంటే..!

డబుల్ మాస్క్ (Image Credit: Twitter)

ఒక మాస్కు పెట్టుకోలేకే విసుగు, చిరాకు వస్తోంటే.. ఈ డబుల్ మాస్క్ ఏంట్రా నాయనా? అని యూత్ తెగ చిరాకు పడిపోతోంది. అసలు డబుల్ మాస్క్ తో ప్రయోజనాలు ఉన్నాయా? అసలు డబుల్ మాస్క్ కథేంటంటే..

 • Share this:
  ‘అబ్బబ్బబ్బా.. ఏం కరోనా రా నాయనా.? ఈ మాస్కులను పెట్టుకోలేక చస్తున్నాం. ఇంట్లోంచి బయటకు వెళ్తే చాలు ముఖానికి మాస్కులు వేసుకోక తప్పడం లేదు. ప్రశాతంగా స్వచ్ఛమైన గాలి పీల్చి ఎన్ని రోజులు అవుతోందో? ఈ మాస్కుల గోల, కరోనా బాధ ఎప్పుడు తగ్గుతుందో?‘ అంటూ ప్రస్తుతం దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతీ పౌరుడు నిర్వేదం వ్యక్తం చేస్తూ ఉండే ఉంటాడు. కానీ ప్రపంచాన్నే గడగడలాడిస్తున్న ఈ కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మాస్కులు ధరించడం తప్పనిసరి. తాజాగా బయటికొచ్చిన ఓ పరిశోధన మాస్కుల అవసరాన్ని నొక్కి చెప్పడమే కాకుండా డబుల్ మాస్క్ పెట్టుకోవడం ఎంత మంచిదో తేల్చిచెబుతోంది. డబుల్ మాస్క్ అంటే ఒక మాస్కుపై మరో మాస్కును ధరించడం అన్న మాట. మరి ఆ పరిశోధన వివరాలేంటో? డబుల్ మాస్క్ ధరించడం వల్ల ప్రయోజనం ఏంటో ఓ లుక్కేయండి.

  అమెరికాలో యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా అనే విశ్వవిద్యాలయం ఉంది. దాంట్లో పనిచేసే ఎమిలీ సిక్బర్ట్ బెన్నెట్ అన్నే శాస్త్రవేత్త తాజాగా ఓ పరిశోధన వివరాలను వెల్లడించారు. జామా ఇంటర్నల్ మెడిసిన్ (JAMA Internal Medicine) అనే జర్నల్ లో ఆ పరిశోధన వివరాలు ప్రచురితం అయ్యాయి. డబుల్ మాస్క్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో, అది కరోనా రాకుండా ఎలా రక్షిస్తుందోనన్నది అందులో వివరంగా ఉన్నారు.
  ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

  ‘వాస్తవానికి కంపెనీలు తయారు చేస్తున్న మాస్కులు కొన్ని రకాల ఫిక్స్ డ్ సైజుల్లో వస్తున్నాయి. మెజార్టీ ప్రజలకు ఆ మాస్కుల సైజులు సరిపోవడం లేదు. బుగ్గల వైపో, గడ్డం కిందో, ముక్కు వద్దో గ్యాప్ ఉండిపోతోంది. అందువల్ల మాస్కులు ధరించినప్పటికీ వందకు వంద శాతం కరోనా రాకుండా అరికట్టలేకపోతున్నాయి. అదే డబుల్ మాస్క్, అంటే మాస్కు మీద మరో మాస్కు కనుక పెట్టుకుంటే లోపల ఉండే మాస్క్ ముఖానికి కరెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఒకమాస్కు నుంచి వైరస్ పొరపాటున లోపలికి వచ్చినా, లోపల ఉన్న మాస్క్ వైరస్ ను అడ్డుకోగలదు. ముఖాన్ని పక్కకు తిప్పినప్పుడో, మాట్లాడినప్పుడో, పైకో, కిందకో చూసినప్పుడో మాస్కు స్థానభ్రంశం అవుతుంటుంది. డబుల్ మాస్క్ వల్ల ఈ ఇబ్బంది ఉండదు. ముఖంపై మాస్కు ధృఢంగా ఎక్కడా ఖాళీ లేకుండా అమరితేనే వైరస్ ను పూర్తిగా అడ్డుకోగలము‘ అని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా శాస్త్రవేత్త ఎమిలీ సిక్బర్ట్ బెన్నెట్ తన పరిశోధనలో పేర్కొన్నారు.
  ఇది కూడా చదవండి: భర్త దారుణ హత్య.. పర్సు తీసుకొస్తానని పోలీసులకు చెప్పి ఇంట్లోకి వెళ్లిన భార్య.. ఎంతకూ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూస్తే..

  N-95 మాస్కులు కరోనా వైరస్ ను సమర్ధవంతంగా అడ్డుకోగలవని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గుల్లేరియా అభిప్రాయపడ్డారు. అయితే అవి మార్కెట్లో అంత విరివిగా లభించడం లేదు. వైద్యసిబ్బందికి కూడా N-95 మాస్కుల కొరత ఉంది. అందువల్ల N-95 మాస్కుల తర్వాత బెస్ట్ అనదగిన ఏకైక ఆప్షన్ ’డబుల్ మాస్క్‘ అని రణ్ దీప్ గుల్లేరియా తేల్చిచెబుతున్నారు. మూడు లేయర్లున్న సర్జికల్ మాస్కుపై వస్త్రంతో తయారు చేసిన మాస్కును ధరించడం చేస్తే మంచిదని ఆయన చెబుతున్నారు. అవి కూడా లేకుంటే, వస్త్రంతో తయారు చేసిన రెండు మాస్కులను ఒకదానిపై మరొకటి పెట్టుకుంటే బెటర్ అని చెబుతున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్న ప్రతీ సారి మాస్కులు విధిగా ధరించాలనీ, ఆ మాస్కులను మాటిమాటికీ చేతుల్తో పట్టుకోకూడదని సూచిస్తున్నారు.
  Published by:Hasaan Kandula
  First published:

  అగ్ర కథనాలు