నేటి నుంచి గుంటూరు జిల్లాలో బస్సు సర్వీసులు ప్రారంభం...

నేటి నుంచి గుంటూరు జిల్లాలోని 13 డిపోల నుంచి 178 సర్వీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌ప్రెస్ నుంచి పల్లె వెలుగు వరకు అన్ని సర్వీస్‌లు మొదలుకానున్నాయి.

news18-telugu
Updated: August 7, 2020, 12:34 PM IST
నేటి నుంచి గుంటూరు జిల్లాలో బస్సు సర్వీసులు ప్రారంభం...
ఫ్రతీకాత్మకచిత్రం
  • Share this:
గుంటూరు జిల్లాలో నేటి నుంచి ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్ డౌన్ కారణంగా మూడు నెలలకు పైగా జిల్లా వ్యాప్తంగా బస్సు సర్వీసులను నిలిపివేశారు. కాగా అన్ లాక్ లో భాగంగా నేటి నుంచి గుంటూరు జిల్లాలోని 13 డిపోల నుంచి 178 సర్వీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఎక్స్‌ప్రెస్ నుంచి పల్లె వెలుగు వరకు అన్ని సర్వీస్‌లు మొదలుకానున్నాయి. బస్సులలోనే కండక్టర్‌ల ద్వారా టికెట్‌లు ఇచ్చే సౌకర్యాన్ని కలిగించినట్లు డిపో మేనేజర్ షర్మిలా తెలిపారు. ప్రయాణీకులు తప్పని సరిగా మాస్క్ ధరించి రావాలని స్పష్టం చేశారు. డిపో ఆవరణలో ఉన్న శానిటైజర్‌లతో చేతులు శుభ్రం చేసుకుని బస్సులు ఎక్కాలని, బస్సులో కూడా భౌతిక దూరం పాటించి సీట్లలో కూర్చోవాలని ఆర్టీసీ అధికారులు కోరారు.
Published by: Krishna Adithya
First published: August 7, 2020, 12:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading