Home /News /coronavirus-latest-news /

APPLE IS DONATING MILLIONS OF MASKS TO HEALTH WORKERS BATTLING CORONAVIRUS MK

కరోనాపై యుద్ధం... బాడీసూట్స్ తయారీ చేసేందుకు యాపిల్ భారీ ప్లాన్

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ (Image: AP)

ఆపిల్ సీఈవో టిమ్ కుక్ (Image: AP)

ఆపిల్ సంస్థ కరోనా నుంచి రక్షణ పొందేందుకు బాడీ సూట్స్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. కరోనా చికిత్సలో పాలుపంచుకునే వైద్యసిబ్బందికి బాడీ సూట్స్ విశేషంగా ఉపకరిస్తాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు.

    టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ కరోనాపై యుద్ధానికి నడుం బిగించింది. ఇప్పటికే న్యూయార్క్ సహా అమెరికా మొత్తం చిగురుటాకులా వణుకుతున్న నేపథ్యంలో ఆపిల్ సంస్థ అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగా ఆపిల్ సంస్థ కరోనా నుంచి రక్షణ పొందేందుకు బాడీ సూట్స్ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. కరోనా చికిత్సలో పాలుపంచుకునే వైద్యసిబ్బందికి బాడీ సూట్స్ విశేషంగా ఉపకరిస్తాయని ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ తెలిపారు. షీల్డ్స్ ను డిజైన్ చేసే క్రమంలో ఆపిల్ సంస్థ తన ప్రొడక్ట్ డిజైనర్లను, ఇంజినీరింగ్ ఉద్యోగులను, ప్యాకేజింగ్ సిబ్బందిని ఒక్కచోటికి చేర్చింది. కాలిఫోర్నియాకు చెందిన ఓ సంస్థతో కలిసి ఈ బాడీ సూట్స్ తయారు చేస్తోంది. వారానికి పది లక్షల కవచాలు తయారుచేయాలని నిర్ణయించారు. వీటిని ప్రస్తుతానికి అమెరికాలో వినియోగించనున్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Apple

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు