Andhra Pradesh: కుటుంబాన్ని బయటపెట్టి తాళం వేసిన అపార్టుమెంట్‌ వాసులు. మంటగలిసిన మానవత్వం

Andhra Pradesh:  కుటుంబాన్ని బయటపెట్టి తాళం వేసిన అపార్టుమెంట్‌ వాసులు. మంటగలిసిన మానవత్వం

మంటగలిస మానవత్వం

కరోనా రక్కసి మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తోంది. కరోనా సోకుతుందనే భయంతో.. ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ అయితే వారిని దారుణంగా ట్రీట్ చేస్తున్నారు కొందరు జనం. నెల్లూరులో ఓ అపార్ట్ మెంట్ అసోసియేషన్ అయితే.. ఒక ఫ్లాట్ లో కుటుంబానికి కరోనా సోకిందని తెలియడంతో ఇంటికి తాళం వేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    ఓ వైపు కరోనా కాటేస్తోంది. మరోవైపు మానత్వం మంటగలుస్తోంది. రోజు రోజు కు మనిషి అన్నవాడు మాయమైపోతున్నాడు. కనీసం జాలి దయ అన్న పదాలకు అర్థమే మరిచిపోతున్నారు. మనం మనుషులం, తోటి వారికి కష్టం వచ్చినప్పుడు మన వాంతు సాయం చేద్దామన్న సంగతి పక్కన పెట్టేస్తున్నారు. స్వార్థం.. భయాలతో అమానుషంగా ప్రవర్తిస్తున్నారు కొందరు. సామాజిక స్పృహ కలిగిన హృదయాలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి.. తప్ప సమాజంలో ఎక్కడా మానత్వం కనిపించే పరిస్థితి లేదు. మానవత్వం విలువలు పూర్తిగా దిగజారిపోతున్నాయి. కరానో కలకలం ఇంకాస్త ఇబ్బందులు తెస్తోంది.

    ఇదే పరిస్థితి కొనసాగితే మనిషన్నవాడు మచ్చుకైనా కనిపించడేమో అనే భయం వెంటాడుతోంది. తాజాగా నెల్లూరులో జరిగిన ఘటన చూస్తే అసలు సమాజం ఎటు వెళ్తోందో అర్థం కావడం లేదు. నవాబ్‌పేట్‌లోని ఓ అపార్టుమెంట్‌లో కుటుంబసభ్యులకు కరోనా సోకింది. కరోనా సోకడం అన్నది వారు చేసిన తప్పు కాదు.. కరోనా సోకడం అన్నది చాలా సహజం ప్రస్తుతం విస్తరణ చూస్తుంటే.. కరోనా సోకడమే వారు చేసిన పాపం అయ్యింది. ఆ కుటుంబాన్ని అంటరానివారిలా వేలేసింది ఓ అపార్ట్ మెంట్.

    కుటుంబ సభ్యులకు కరోనా సోకింది అని తెలియగానే మిగిలిన అపార్టు మెంట్ వాసులంతా ఏకమై. ఒక తీర్మానానికి వచ్చారు. ఆ కుటుంబ సభ్యులను బయటకు రానివ్వకుండా అపార్టుమెంట్ వాసులు తాళం వేశారు. కరోనా తమకు కూడా సోకుతుందనే కారణంగా అపార్టుమెంట్ వాసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. బలవంతంగా ఇంట్లో పెట్టి తాళం వేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి ఆవేదన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు తాళాలు పగలగొట్టి. అసోసియేషన్ వారిపై కేసు నమోదు చేశారు. వారికి చికిత్స అందేలా చేశారు.

    ఇతరులకు కరోనా సోకింది అంటే జాగ్రత్తలు పాటించడం మంచిదే ఎవరూ కాదన లేం. కానీ ఇలా ఇంట్లో పెట్టి తాళాలు వేస్తే వారి పరిస్థితి ఏంటి. వారికి మందులు ఇచ్చేది ఎవరు? వారికి ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరు. కరోనా సోకిందని తెలిసిన వెంటనే వాళ్లకు దూరంగా ఉండడం మంచిదే. కానీ వెంటనే వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడం లేద.. అంబులెన్స్ కు కాల్ చేయాలి.. ఆ కుటుంబ బయటకు వచ్చే పరిస్థితి లేకుండా ఇంట్లో ఐసోలేషన్ అయితే.. కుదిరినంత దూరంగా ఉంటూ సాయం చేయాలి. కానీ నవాబ్ పేటలోని అపార్టు మెంట్ వాసులు మాత్రం.. కరోనా సోకింది అంటే వారేదో పాపం చేసినట్టు ఇంట్లో ఇంట్లోనే పెట్టి బంధించడం దారుణం. ఇంకా ఇలాంటి ఘటనలు చాలానే జరుగుతున్నా బయటకు రావడం లేదనే నిపుణులు చెబుతున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    అగ్ర కథనాలు