ఏపీకి వెళ్లాలనుకుంటున్నారా? కొత్త కండిషన్స్ తెలుసుకోండి...

ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి బోర్డర్‌ చెక్ పోస్టుల వద్ద తప్పకుండా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.

news18-telugu
Updated: May 31, 2020, 10:54 PM IST
ఏపీకి వెళ్లాలనుకుంటున్నారా? కొత్త కండిషన్స్ తెలుసుకోండి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలను ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారికి బోర్డర్‌ చెక్ పోస్టుల వద్ద తప్పకుండా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. పరీక్షల కోసం కొంత సమయం పట్టే అవకాశం ఉంది కాబట్టి, అందరూ అందుకు సహకరించాలని కోరింది. ఒకవేళ కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారికి క్వారంటైన్ స్టాంప్ వేస్తారు. 14 రోజుల పాటు వారు హోం క్వారంటైన్‌లో ఉండాలి. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ అయితే, వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తారు. లాక్ డౌన్ 5లో భాగంగా కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ నిబంధనల ప్రకారం.. అంతర్రాష్ట్ర ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. వ్యక్తులు, గూడ్స్ క్యారియర్లకు ఎలాంటి పర్మిషన్లు, పాస్‌లు లేకుండానే అనుమతిస్తారు. అంటే ఏపీలోకి సొంత కారులో వెళ్లినా.. వారికి చెక్ పోస్టుల వద్ద కరోనా పరీక్షలు జరిపిన తర్వాతే అనుమతిస్తారు.
First published: May 31, 2020, 10:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading