ఆ విద్యార్థులందరికీ స్మార్ట్‌ఫోన్లు... ఏపీలో సంచలన నిర్ణయం... ఎందుకో తెలుసా?

కాలం మారుతోంది. చాలా మార్పులు వస్తున్నాయి. ఇదివరకు పిల్లలకు మొబైళ్లు ఇవ్వడం తప్పు అనేవారంతా. ఇప్పుడో... మొబైల్ తప్పనిసరి కాబోతోంది.

news18-telugu
Updated: June 6, 2020, 11:54 AM IST
ఆ విద్యార్థులందరికీ స్మార్ట్‌ఫోన్లు... ఏపీలో సంచలన నిర్ణయం... ఎందుకో తెలుసా?
మరోవైపు విద్యార్థులందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండకపోవడం కూడా ఆన్‌లైన్ క్లాసులకు సమస్యగా మారుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పంజాబ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండుండి సంచలన నిర్మయాలు తీసుకుంటుంది. మిగతా చాలా రాష్ట్రాల పాలకులు... ఆ సంచలన నిర్ణయాలు తెలుసుకొని... ఏపీ వైపు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. ఆ నిర్ణయం ఏంటి, ఎందుకు తీసుకున్నారు అని ఆరా తీస్తున్నారు. అలాంటి ఓ నిర్ణయం ఇప్పుడు తీసుకుంది ఏపీ ప్రభుత్వంలోని సాంఘిక సంక్షేమ గురుకులాల పాలక మండలి. ఏంటంటే... 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ ఉన్న విద్యార్థులందరికీ... స్మార్ట్ ‌ఫోన్లు ఇవ్వనుంది పాలకమండలి. ఈ ఫోన్ల రేటు రూ.5 వేల నుంచి రూ.6 వేల దాకా ఉండనుంది. సడెన్‌గా ఇవి ఎందుకు అంటే... ఇప్పుడు కరోనా రోజులు కదా. విద్యార్థులందరికీ... చెప్పే పాఠాలు, చేయాల్సిన హోం వర్క్ ఇలాంటి వివరాలన్నీ మొబైల్‌కి వస్తాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రభుత్వం పంపనున్నట్లు తెలిసింది. ఆ డేటా చదువుకొని... విద్యార్థులు ముందుకు సాగాలి.

ఆల్రెడీ చాలా ఇళ్లలో ఇప్పుడు స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి. ఐతే... అవి లేని పేద విద్యార్థులు చాలా మంది ఉన్నారు. మొబైల్ కొనుక్కునే స్థోమత లేక... తమ పిల్లలకు ఆన్‌లైన్ చదువు దూరమవుతుందేమో అని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. ఇవన్నీ గమనించిన సాంఘిక సంక్షేమ గురుకులాల పాలకమండలి... ఆన్‌లైన్ క్లాసులు తెస్తున్నాం కాబట్టి... అందుకు అవసరమైన వాటిని కూడా మనమే ఇవ్వాలి అని డిసైడైంది. ఆ ప్రకారమే... సొసైటీ పరిధిలోని గురుకులాల్లో చదివే 60వేల మంది విద్యార్థుల్లో 40 శాతం మందికే స్మార్ట్‌ ఫోన్లు ఉన్నాయనీ, ఇతర విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సొసైటీ తెలిపింది.

తాజా నిర్ణయం ప్రకారం... సాంక్షిక సంక్షేమ గురుకులాల్లో చదివే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు రానున్నాయి. ఇక వాళ్లు ఈ విద్యా సంవత్సరాన్ని ఆన్ లైన్ క్లాసుల ద్వారా చదువుకోగలరు. ఐతే... ఏపీలో గురుకులాల్లో చదవని విద్యార్థుల్లో కూడా చాలా మందికి మొబైల్స్ లేవు. వాటిని కొనుక్కునే స్థోమత కూడా లేదు. వారికి కూడా ఇలాంటివి ఇవ్వాలనే డిమాండ్లు వస్తున్నాయి.
Published by: Krishna Kumar N
First published: June 6, 2020, 11:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading