క్వారంటైన్ సెంటర్ వద్ద వలస కార్మికుడు ఆత్మహత్య.. ఏపీ నుంచి వెళ్లి..

క్వారంటైన్ కేంద్రం సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని సురేంద్ర చనిపోయాడు. అసలు క్వారంటైన్ సెంటర్ నుంచి అతడు బయటకు ఎలా వెళ్లాడన్న దానిపై ఆరా తీస్తున్నారు.

news18-telugu
Updated: May 15, 2020, 6:55 PM IST
క్వారంటైన్ సెంటర్ వద్ద వలస కార్మికుడు ఆత్మహత్య.. ఏపీ నుంచి వెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా కాలంలో వలస కార్మికులు కష్టాలు వర్ణనాతీతం..! చేతిలో పనిలేక.. ఉండేందుకు డబ్బుల్లేక.. సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. ప్రత్యేక రైళ్లు, కాలినడకన వెళ్లిన వలస కార్మికులను సొంత రాష్ట్రాల్లో క్వారంటైన్ సెంటర్లో ఉంచుతున్నారు. ఈ క్రమంలో ఒడిశాలో ఓ వలస కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మయూర్‌భంజ్ జిల్లా బెత్నోటి మండలం అన్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. గురువారం రాత్రి క్వారంటైన్ కేంద్రం సమీపంలో ఉన్న ఉన్న చెట్టుకు అతడు ఉరివేసుకొని మరణించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయూర్‌భంజ్ జిల్లా రైకామ గ్రామానికి చెందిన 35 ఏళ్ల సురేంద్ర బెహ్రా పొట్టకూటి కోసం ఏపీకి వెళ్లి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. లాక్‌డౌన్ పనుల్లేక ఇబ్బందులు పడ్డాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే శ్రామిక్ రైలులో భార్యతో కలిసి విజయవాడ నుంచి ఒడిశాకు వెళ్లాడు. అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారంతా క్వారంటైన్ సెంటర్లో ఉండాలి. ఆ క్రమంలోనే అతడిని దంబారుదాహార్ క్వారంటైన్‌లో ఉంచారు. అతడి భార్యను మరో ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. ఐతే ఏమైందో ఏమోగానీ.. గురువారం రాత్రి క్వారంటైన్ కేంద్రం సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకొని సురేంద్ర చనిపోయాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు క్వారంటైన్ సెంటర్ నుంచి బయటకు ఎలా వెళ్లాడన్న దానిపై ఆరా తీస్తున్నారు.



First published: May 15, 2020, 6:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading