ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. నేడు 998 మందికి పాజిటివ్..

ఏపీలో గడిచిన 24 గంటల్లో 998 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. 14 మంది చనిపోయారు.

news18-telugu
Updated: July 5, 2020, 2:35 PM IST
ఏపీలో 10 లక్షలు దాటిన కరోనా పరీక్షలు.. నేడు 998 మందికి పాజిటివ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ రోజురోజుకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 14 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లాలో ఐదుగురు, అనంతపూర్ జిల్లాలో ముగ్గురు, విశాఖపట్నంలో ఒకరు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణాలో ఒకరు చనిపోయినట్టు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 998 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 961 ఏపీలో ఉన్నవారు, 36 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, ఒకరు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఏపీలో 18,697 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో ప్రస్తుతం 10043 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 8422 మంది డిశ్చార్జ్ అయ్యారు. 232 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో ఏపీలో 20,567 కరోనా పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1017140 కరోనా టెస్టులు చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 5, 2020, 2:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading