హోమ్ /వార్తలు /కరోనా విలయతాండవం /

ఇది ఒక యుద్ధం.. లాక్‌డౌన్‌పై ఏపీ పోలీస్ శాఖ సందేశాత్మక గీతం

ఇది ఒక యుద్ధం.. లాక్‌డౌన్‌పై ఏపీ పోలీస్ శాఖ సందేశాత్మక గీతం

కరోనా లాక్‌డౌన్‌పై ఏపీ పోలీస్ పాట

కరోనా లాక్‌డౌన్‌పై ఏపీ పోలీస్ పాట

విశాఖపట్టణానికి చెందిన పోలిస్ కానిస్టేబుల్ కేటీవీ రమేష్.. ఈ పాటను రాసి పాడారు. ఏఆర్ కానిస్టేబుల్ హేమంత్ కొరియోగ్రఫీ చేశారు.

కరోనా లాక్‌డౌన్‌ అమలు కోసం పోలీసులు మాత్రం మండుటెండల్లో పనిచేస్తున్నారు. రోడ్లపై విధులు నిర్వహిస్తూ.. ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తున్నారు. అవసరం ఉంటే తప్ప రోడ్ల మీదకు రావొద్దంటూ.. చేతులు జోడించి వేడుకుంటున్నారు. చెబితే వినకుంటేనే లాఠీలకు పనిచెబుతున్నారు. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు, వైరస్ మహమ్మారి తరిమికొట్టేందుకు.. పోలీసులు అంతలా కష్టపడుతున్నారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది తర్వాత రక్షక భటులే ముందు వరుసలో ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ పోలీస్ శాఖ మరో అడుగు ముందుకేసి కరోనా లాక్‌డౌన్‌పై సందేశాత్మక గీతం రూపొందించింది.

పోలీస్ శాఖ సిబ్బందే ఈ పాటను పాడి... కరోనాపై ప్రజలకు సందేశమిచ్చారు. ఇది ఒక యుద్ధం.. నేనే ఆయుధం.. నువ్వే ఇక సైన్యం.. అంటూ సాగే పాటను ఏపీ పోలీస్ శాఖ విడుదల చేసింది. ప్రభుత్వాలు చెప్పినట్లుగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని దీని ద్వారా ప్రజలకు సూచించారు. ఉన్నది తిని ఇంట్లోనే ఉండు, ప్రజల సంరక్షణే పోలీసుల ధ్యేయం, ప్రాణాలకు తెగించి కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి సెల్యూట్, పారిశుద్ధ్యమే మహభాగ్యం అని సందేశం ఇచ్చారు. అందరికీ కనెక్ట్ అయ్యేలా పాటను రూపొందించారు. విశాఖపట్టణానికి చెందిన పోలిస్ కానిస్టేబుల్ కేటీవీ రమేష్.. ఈ పాటను రాసి పాడారు. ఏఆర్ కానిస్టేబుల్ హేమంత్ కొరియోగ్రఫీ చేశారు. అందరినీ ఆలోచింపజేస్తున్న ఈ పాట.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Police, Corona virus, Coronavirus, Covid-19, Lockdown

ఉత్తమ కథలు